Viral Video Of Lion: సింహం వెనకాలే దాని పిల్లల పరుగులు.. క్యూట్ వీడియో

 పని ఒత్తిడిలో చాలా డల్ గా ఉన్నారా? అయితే, ఈ వీడియో మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఓ సింహం వెనుక దాని పిల్లలు నడుస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన్సు యెగెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. జంతు ప్రదర్శన శాలలో ఓ సింహం తన పిల్లలను వదిలి నడుచుకుంటూ వెళ్తుంది. దాని వెనకాలే సింహం పిల్లలు వస్తుంటాయి.

Viral Video Of Lion: సింహం వెనకాలే దాని పిల్లల పరుగులు.. క్యూట్ వీడియో

Viral Video Of Lion: పని ఒత్తిడిలో చాలా డల్ గా ఉన్నారా? అయితే, ఈ వీడియో మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఓ సింహం వెనుక దాని పిల్లలు నడుస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన్సు యెగెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. జంతు ప్రదర్శన శాలలో ఓ సింహం తన పిల్లలను వదిలి నడుచుకుంటూ వెళ్తుంది. దాని వెనకాలే సింహం పిల్లలు వస్తుంటాయి.

పెద్ద సింహం పరుగులు తీస్తుంటే దాని పిల్లలు కూడా చిన్ని చిన్ని అడుగులతో పరుగులు తీశాయి. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తండ్రి అడుగు జాడల్లోనూ సింహం పిల్లలు నడుస్తున్నాయని కొందరు పేర్కొన్నారు. ఇప్పుడు మొదలైన ఈ పరుగు జీవితాంతం తీయాల్సి ఉంటుందని ఆ పిల్ల సింహాలకు తెలియదని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. సాధారణంగా కుక్కలు, పిల్లుల పిల్లలను చూస్తుంటాం. సింహం పిల్లలను చూడడం చాలా అరుదు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..