Viral Video: గున్న ఏనుగుకి జ‌డ్+++ సెక్యూరిటీ.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో

ఓ గున్న ఏనుగును పెద్ద ఏనుగులు అత్యంత జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లాయి. ఎంత‌గా అంటే ఆ గున్న ఏనుగుకు ''జ‌డ్+++'' సెక్యూరిటీ అందిస్తున్నంత‌గా.

Viral Video: గున్న ఏనుగుకి జ‌డ్+++ సెక్యూరిటీ.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో

Elephant2

Viral Video: ఓ గున్న ఏనుగును పెద్ద ఏనుగులు అత్యంత జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లాయి. ఎంత‌గా అంటే ఆ గున్న ఏనుగుకు ”జ‌డ్+++” సెక్యూరిటీ అందిస్తున్నంత‌గా. సాధార‌ణంగా అతి ముఖ్య‌మైన వ్య‌క్తుల‌కు జడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉంటుంది. గున్న ఏనుగుకి అదే విధంగా భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న రీతిలో పెద్ద ఏనుగులు వ్య‌వ‌హ‌రించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సునంత నంద పోస్ట్ చేశారు. ఈ భ‌ద్ర‌త మామూలు భ‌ద్ర‌త కాదు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

గున్న ఏనుగుకు పెద్ద ఏనుగులు ఈ రీతిలో భ‌ద్ర‌త క‌ల్పించిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు, సత్యమంగళంలో చోటు చేసుకుంది. రోడ్డుపై నుంచి గున్న ఏనుగును తీసుకెళ్తున్న స‌మ‌యంలో దానికి ఎలాంటి హానీ జ‌ర‌గ‌కుండా పెద్ద ఏనుగులు చుట్టూ చేరాయి. దాన్ని మ‌ధ్య‌లో ఉంచాయి. అత్యంత భ‌ద్ర‌త న‌డుమ గున్న ఏనుగు రోడ్డుపై దర్జాగా న‌డుస్తూ వెళ్లింది. ఆ గున్న ఏనుగుకు ఏనుగుల గుంపు ఇంత‌గా భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నాయ‌ని, ప్ర‌పంచంలో ఇంత‌క‌న్నా భ‌ద్ర‌త ఎవ్వ‌రూ ఇవ్వ‌లేరని ఐఎఫ్ఎస్ అధికారి సునంత నంద పేర్కొన్నారు. దీన్నే జ‌డ్+++ సెక్యూరిటీగా సంబోధించారు. ఆయ‌న తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.