Viral Video: ‘కర్మ సిద్ధాంతం’.. పక్కనుంచి వెళ్తున్న బైకర్‌ను తన్నేందుకు ప్రయత్నించి కింద పడ్డ యువతి.. వీడియో వైరల్

‘కర్మ’ ఎవ్వరినీ వదిలిపెట్టదని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ వీడియో. తమ పక్కనే ఒక బైక్‌పై వెళ్తున్న యువకుడిని తన్నేందుకు, మరో బైక్‌పై వెళ్తున్న యువతి ప్రయత్నించింది. అయితే, ఆమె పట్టు కోల్పోయి కింద పడింది.

Viral Video: ‘కర్మ సిద్ధాంతం’.. పక్కనుంచి వెళ్తున్న బైకర్‌ను తన్నేందుకు ప్రయత్నించి కింద పడ్డ యువతి.. వీడియో వైరల్

Viral Video: ‘కర్మ సిద్ధాంతం’ గురించి చాలా సార్లు వినే ఉంటారు. ఎవరికైనా హాని చేయాలనుకుంటే తిరిగి వారికే హాని జరుగుతుందని దీని అర్థం. ఈ వీడియో చూస్తే నిజమే అనిపించకమానదు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.

Nilgai-Tiger: నిల్గాయ్-పులి మధ్య హైడ్ అండ్ సీక్ ఆట.. పులికి నిల్గాయ్ చిక్కిందా.. చివరికి ఏం జరిగిందో చూడండి

కానీ, నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రకారం.. ఒక యువతి, మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళ్తోంది. ఆ పక్కనే మరో బైక్‌పై వేరే యువకుడు వెళ్తున్నాడు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ… బైక్‌పై వెనుక కూర్చుని వెళ్తున్న యువతి, పక్కనే వెళ్తున్న బైకర్‌ను తన్నేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె బైక్‌పై పట్టు కోల్పోయి కింద పడింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి తన బైక్ ఆపి ఆమెకు సహాయం చేసేందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tipu Jayanti: ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల కోసం అనుమతి కోరిన ఎంఐఎం

వేరే బైకర్‌కు హాని చేసేందుకు ప్రయత్నించిన యువతి.. తనే కింద పడి గాయపడింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇతరులకు హాని చేయాలనుకుంటే మీకే హాని జరుగుతుందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.