Viral wedding: ఒంటి నిండా గాయాలతో పెళ్లి చేసుకున్న యువకుడు.. ఏమైందంటే?

ఇండోనేషియాలో ఓ పెళ్లి మాత్రం విచిత్ర పరిస్థితుల మధ్య జరిగింది. పెళ్లి కుమార్తె సాంప్రదాయ పెళ్లి వస్త్రాలు, భారీ ఆభరాణాలు ధరించి పెళ్లి మండపంలో కూర్చుంటే.. పెళ్లి కుమారుడు మాత్రం ఒంటి నిండా గాయాలతో ఒక్క షార్ట్ తప్ప ఒంటి మీద ఎలాంటి ఖరీదైన బట్టలు లేకుండా మండపంలో కూర్చున్నాడు.

Viral wedding: ఒంటి నిండా గాయాలతో పెళ్లి చేసుకున్న యువకుడు.. ఏమైందంటే?

Viral Wedding

Viral wedding: సంప్రదాయాలు మారినా.. రాష్ట్రాలు, దేశాలు మారినా పెళ్లనేది ప్రతి ఒక్కరికి జీవితంలో జరిపే ఒక మరపురాని ఘటన. సహజంగా చాలా దేశాలలో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటారు. వారి వారి సంప్రదాయాలలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కానీ ఇండోనేషియాలో ఓ పెళ్లి మాత్రం విచిత్ర పరిస్థితుల మధ్య జరిగింది. పెళ్లి కుమార్తె సాంప్రదాయ పెళ్లి వస్త్రాలు, భారీ ఆభరాణాలు ధరించి పెళ్లి మండపంలో కూర్చుంటే.. పెళ్లి కుమారుడు మాత్రం ఒంటి నిండా గాయాలతో ఒక్క షార్ట్ తప్ప ఒంటి మీద ఎలాంటి ఖరీదైన బట్టలు లేకుండా మండపంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి తంతు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

అసలు వివరాలలోకి వెళ్తే.. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రాంతానికి చెందిన ఈ యువ జంట ఇటీవల ఒక్కటైంది. వధువు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో, వరుడు ఒక ఎరుపు రంగు షార్ట్ వేసుకొని పెళ్లి చేసుకున్నారు. అతడి శరీరంపై గాయాలు, వాటికి బ్యాండ్‌ ఎయిడ్‌లతో కనిపించడంతో ఈ పెళ్లి వైరల్ గా మారింది. ఈ ఏప్రిల్ 2న లిండా ద్వి క్రిస్టియాని అనే యువతిని సుప్రప్టో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. సరిగ్గా పెళ్లికి కేవలం నాలుగు రోజుల ముందు పెళ్లి పనుల్లో ఉండగా సుప్రప్టోకు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

పెళ్లి రోజుకు సుప్రప్టో శరీరంపై గాయాలు ఉండగా అతడి భుజం బాగా తినగా ఆపరేషన్ కూడా జరిగింది. అయినా పెళ్లి వాయిదా వేయడం ఇష్టంలేక ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి వేడుకను ఏ మాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహించారు. అయితే, భుజానికి సర్జరీ, ఒంటి నిండా గాయాలతో సుప్రప్టో సంప్రదాయ పెళ్లి దుస్తులు వేసుకోవడం సాధ్యపడలేదు. లిండా ద్వి మాత్రం నిండైన సంప్రదాయ పెళ్లి దుస్తులు ధరించగా సుప్రప్టో షార్ట్ తోనే పెళ్లి చేసుకున్నాడు. ఓ వ్యక్తి ఈ పెళ్లి వేడుకను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ పెళ్లి వైరల్ గా మారగా నెటిజన్లు ఈ జంటను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.