Virat Kohli: మ్యాచ్ అనంతరం ధోనీని పొగిడిన ట్వీట్ డిలీట్ చేసి కోహ్లీ

అభిమాని అంటే.. ఎప్పటికీ అభిమానే అని రుజువు చేస్తూ కోహ్లీ సైతం ట్విట్టర్ లో ధోనీపై అభిమానాన్ని.. అతని ప్రదర్శన పట్ల వచ్చిన సంతోషాన్ని పోస్టు రూపంలో వ్యక్తపరిచాడు.

Virat Kohli: మ్యాచ్ అనంతరం ధోనీని పొగిడిన ట్వీట్ డిలీట్ చేసి కోహ్లీ

Virat Kohli

Virat Kohli: ఆదివారం రాత్రి అలజడి జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ మరోసారి స్టైలిష్ ఫినిషింగ్ ఇచ్చాడు. కెప్టెన్ గా ఐడియాలజీతో జట్టును ఎప్పుడూ నిలబెట్టే ధోనీ.. కొంత గ్యాప్ తర్వాత బ్యాట్ తో మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చాడు. 11బంతుల్లో 24పరుగుల కావాల్సిన సమయంలో కెప్టెన్ వీరోచిత ప్రదర్శనను యావత్ క్రికెట్ ప్రపంచం సంబరాలు చేసుకుంది.

ఆవేశ్ ఖాన్, టామ్ కరన్ బౌలింగ్ వేయనుండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇక గెలుపు ఖాయమని భావిస్తున్న తరుణంలో ఈ మ్యాజిక్ జరిగింది. ఢిల్లీ వ్యూహాలకు చెక్ పెడుతూ రెండు బంతులు మిగిలి ఉండగానే క్వాలిఫైర్ 1ను విజయంతో ముగించాడు. మ్యాచ్ అనంతరం మహేంద్రుడిపై ప్రశంసల వెల్లువకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది.

అభిమాని అంటే.. ఎప్పటికీ అభిమానే అని రుజువు చేస్తూ కోహ్లీ సైతం ట్విట్టర్ లో ధోనీపై అభిమానాన్ని.. అతని ప్రదర్శన పట్ల వచ్చిన సంతోషాన్ని పోస్టు రూపంలో వ్యక్తపరిచాడు. అయితే తాను చేసిన ట్వీట్ మళ్లీ తానే డిలీట్ చేసి ఇంకో పోస్టు పెట్టాడు.

…………………………………………….. : గుడిలో ‘ఇడియట్’ హీరోయిన్‌ను చుట్టుముట్టిన జనాలు

‘కింగ్ ఈజ్ బ్యాక్.. గేమ్‌లో ఎప్పటికీ గ్రేటెస్ట్ ఫినిషర్ అతనే. ఈ రాత్రి జరిగిన మ్యాచ్ చూసి మరోసారి సీటులో నుంచి ఎగిరిదూకా’ అని పోస్టు పెట్టాడు. అయితే అంతకుముందు చేసిన పోస్టులో ఎప్పటికీ అనే పదం లేకుండా పోస్టు చేయడంతో గేమ్ లో గ్రేటెస్ట్ ఫినిషర్ అని ఒక్క మ్యాచ్ గురించి మాత్రమే అర్థం వస్తుండటంతో దానిని డిలీట్ చేసి ఇంకో ట్వీట్ చేశాడు కోహ్లీ.

ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నేరుగా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.