Vishal : మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్.. ఆ బిల్డింగ్ కట్టాకే పెళ్లి చేసుకుంటా..

ఈ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ.. ''ఒకసారి ఓ పోలీస్ కానిస్టేబుల్ నన్ను అడిగాడు పోలీసుల్లో అందరి మీద సినిమాలు తీస్తారు, మా మీద తీయరా అని అడిగాడు. దాంతో ఈ సినిమా ఆలోచన...........

Vishal : మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్.. ఆ బిల్డింగ్ కట్టాకే పెళ్లి చేసుకుంటా..

Vishal gives clarity on his marriage

Vishal :  తమిళ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు. ఇక విశాల్ సినిమాల్లోనే కాక బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. త్వరలో విశాల్ లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఆదివారం నాడు లాఠీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా విశాల్ తో సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. విజయేంద్ర ప్రసాద్, కార్తికేయ ముఖ్య అతిశులుగా వచ్చారు ఈ ఈవెంట్ కి.

Dhoni : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ధోని.. తలైవా ఫ్యాన్స్‌కి పండగే..

ఈ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ.. ”ఒకసారి ఓ పోలీస్ కానిస్టేబుల్ నన్ను అడిగాడు పోలీసుల్లో అందరి మీద సినిమాలు తీస్తారు, మా మీద తీయరా అని అడిగాడు. దాంతో ఈ సినిమా ఆలోచన నాకు వచ్చింది. ఈ లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్ కు అంకితం చేస్తున్నాను. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే నేను పెళ్లి చేసుకుంటాను. 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవన నిర్మాణం జరుగుతుంది. కళాకారులు జీవనాన్ని మరింత మెరుగుపర్చేందుకు నా బృందం శ్రమిస్తోంది. త్వరలోనే భవనాన్ని నిర్మించి నేను పెళ్లిచేసుకుంటాను” అని తెలిపారు.