‘పాగల్’ ఆగయా..

‘పాగల్’ ఆగయా..

Paagal : ‘వెళ్లిపోమాకే’ చిత్రంతో హీరోగా పరిచమై.. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’ ‘హిట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పాగల్’..

నరేష్ కుప్పిలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://10tv.in/vishwaksens-paagal-started-formal-pooja-28565/

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. విశ్వక్ కొత్త అవతార్‌లో ఆకట్టుకుంటున్నాడు. సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలోకి తీసుకురానున్నారు. సంగీతం : రథన్, కెమెరా : మణికందన్.

Paagal