Updated On - 10:05 pm, Sat, 13 February 21
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్లు ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రాను నియమించింది. ఈ నిర్ణయం మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా.. జ్యోతి మల్హోత్రాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు వోల్వో కార్స్ ఇండియా శనివారం ప్రకటించింది.
49 ఏళ్ల మల్హోత్రా భారతదేశంలో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా అయిన మొదటి భారతీయుడు. ప్రస్తుతం మల్హోత్రా డైరెక్టర్ ఆఫ్.. సేల్స్ అండ్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 2016లో మల్హోత్రా కంపెనీలో చేరారు.
మల్హోత్రా… అంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఫియట్ ఇండియా వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వాహనరంగంలో ఆయనకు 24 సంవత్సరాల అనుభవం ఉంది.
India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!
Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3లక్షల కేసులు, మే చివరి వరకూ తీవ్రత
Foreign Made Vaccines : వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
కరోనాపై పోరాటంలో ‘Sputnik V’.. వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలుసుకోండి
Vaccine Shortage : భారత్ ను వేధిస్తోన్న టీకాల కొరత
Corona Second wave : వణుకు పుట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. ఒక్క రోజులోనే లక్షా 50 వేలకు పైగా కేసులు