Voting in Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదట దశ పోలింగ్ ఈ నెల 1న, రెండో దశ పోలింగ్ నేడు జరిగాయి. నేటి సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

Voting in Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు..

Voting in Gujarat

Voting in Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదట దశ పోలింగ్ ఈ నెల 1న, రెండో దశ పోలింగ్ నేడు జరిగాయి. నేటి సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

నేడు ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటే వేసేందుకు అహ్మదాబాద్ కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వెళ్లారు. మోదీ క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

lndia vs Bangladesh: బంగ్లా జట్టుపై టీమిండియా ఓటమికి కారణం ఏమిటి? కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే.

గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపించనుందన్న ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న బీజేపీపై సాధారణంగా ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచేసుకునేలా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాయి.

గుజరాత్ లో తాము అధికారంలోకి వస్తే ఎన్నో పనులు చేస్తామంటూ ప్రజల ముందు వరాల జల్లు కురిపించాయి. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన అంచనాల మాదిరిగానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. జనాల నాడిని ఎగ్జిట్ పోల్స్ బాగా పట్టేస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..