Sugar Levels : షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే?

పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండ‌వు. క‌నుక పిండి పదార్థాల‌ను పూర్తిగా త‌గ్గించాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

Sugar Levels : షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే?

Diabetes

Sugar Levels : డ‌యాబెటిస్ స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఇటీవలికాలంలో చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. జీవ‌న‌విధానం సరిగా లేకపోవటం వ‌ల్ల‌ చాలా మంది  డ‌యాబెటిస్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అయితే డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారు డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకుంటూనే,  తినేఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సులభంగా షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

శారీర‌క శ్ర‌మ లేని వారిలో డయాబెటిస్ వస్తుంది. అలాంటి వారు శారీర‌క శ్ర‌మ చేయాలి. 30 నిమిషాల పాటు తేలిక‌పాటి న‌డ‌క అయినా ప్రారంభించాలి. కుదిరితే సైక్లింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌, ఎరోబిక్స్‌, బ‌రువులు ఎత్త‌డం, యోగా వంటివి చేయాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్లియర్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీవక్రియ క్రమంగా పనిచేసి, షుగర్ రాకుండా సహాయపడుతుంది.

పంచదారతో తయారు చేసినటువంటి ఉత్పత్తుల వాడకంను పూర్తిగా నివారించడం మధుమేహగ్రస్తులకు ఉత్తమం. ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు తీసుకునే అహారంలో పీచు పదార్థాలు అధికంగా వుండేలా చూసుకోవాలి. అంటే రోజుకు సుమారు 400 నుంచి 500గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. డైట్‌లో చిరుధాన్యాలు ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే రకమైనవి కాకుండా కలగలిపి తీసుకోవాలి.

పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండ‌వు. క‌నుక పిండి పదార్థాల‌ను పూర్తిగా త‌గ్గించాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అన్నంకు బ‌దులుగా రాగులు, జొన్న‌లు, స‌జ్జ‌లు, కొర్ర‌లు వంటి చిరు ధాన్యాల‌తో చేసిన ఆహారాల‌ను తినాలి. అలాగే ట‌మాటాలు, క్యారెట్‌, కీర దోస వంటి కూర‌గాయ‌ల‌ను ప‌చ్చిగానే తినాలి. బీట్‌రూట్‌ను కూడా చేర్చుకోవాలి. ఉద‌యం అల్పాహారంలో ఏదైనా కూర‌గాయ‌ల ర‌సం తాగాలి. మధ్యాహ్నం వెజిట‌బుల్ స‌లాడ్ తీసుకోవాలి. రాత్రి పండ్ల‌ను చేర్చుకోవాలి. దీంతో పిండి ప‌దార్థాలను తీసుకోవ‌డం త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా షుగ‌ర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తాయి.

గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది . టీలో ఉండే పాలీఫెనాల్స్‌ మెటాబాలిజంను ప్రేరేపిస్తుంది. గ్రీన్‌ టీ తక్కువ ప్రాసెస్‌ అయి ఉండడమే కాక అందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. చాలా మంది రోజూ త‌గినంత నీటిని తాగ‌రు. దీని వ‌ల్ల శ‌రీర జీవ‌క్రియ‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండ‌వు. క‌నుక రోజై త‌గినంత నీటిని తాగాలి. ఇది జీవ‌క్రియ‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌డం తేలిక‌వుతుంది.

మ‌నం తినే ఆహారాల్లో ఉండే పిండి ప‌దార్థాల స్థాయిని బ‌ట్టి అవి మ‌న శ‌రీరంలో గ్లూకోజ్‌గా మారే రేటు ఉంటుంది. ఎక్కువ పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాల‌ను తింటే మ‌న శ‌రీరంలో గ్లూకోజ్ త్వ‌ర‌గా ఉత్ప‌త్తి అయి షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. అలాంటి ఆహారాల‌ను హై గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ ఉన్న‌విగా చెబుతారు. క‌నుక లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల‌ను తినాలి. అంటే త‌క్కువ పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాలు అన్న‌మాట‌. వీటిని తిన్న వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు.