Congress vs TRS: రసవత్తరంగా భద్రాద్రి జిల్లా రాజకీయం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే (తెరాస) రేగా కాంతారావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Congress vs TRS: రసవత్తరంగా భద్రాద్రి జిల్లా రాజకీయం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాళ్లు

Mla's War

Congress vs TRS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే (తెరాస) రేగా కాంతారావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు సీట్లు గెలుస్తామని రేగా కాంతారావు అంటుంటే.. జిల్లాలోని ఐదు సీట్లు గెలవడం కాదు కదా.. నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఈసారి గెలవలేవు అంటూ రేగా కాంతారావును ఉద్దేశించి, పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలో రేగాను గెలవనివ్వను అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై రేగా కాంతారావు ప్రతి విమర్శ చేశారు.

P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

వచ్చే ఎన్నికల్లో పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా గెలవలేడని, మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని రేగా కాంతారావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నీ అడ్రస్ ఎక్కడుంటుందో చూస్తానంటూ వీరయ్యకు రేగా ప్రతి సవాల్ విసిరారు. సోషల్ మీడియా వేదికగా ఇరువురూ విసురుకుంటున్న సవాళ్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.