అన్నతోనా.. తమ్ముడితోనా?.. సస్పెన్స్‌లో పడేసిన ఆఫ్ఘాన్ బ్యూటీ..

అన్నతోనా.. తమ్ముడితోనా?.. సస్పెన్స్‌లో పడేసిన ఆఫ్ఘాన్ బ్యూటీ..

Warina Hussain: ‘లవ్ యాత్రి’ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ లో ‘‘మున్నా బద్నామ్’’ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హాట్ బ్యూటీ వరీనా హుస్సేన్ టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయింది. కొత్త సినిమాలో నటించడానికి హైదరాబాద్ వచ్చిన ఈ ఆఫ్ఘాన్ బేబి వచ్చీ రావడంతోనే ఆడియన్స్‌ను సస్పెన్స్‌లో పడేసింది.

Warina Hussain

‘నమస్కారం.. నేను హైదరాబాద్‌లో ఉన్నాను.. మీ అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను.. అది త్వరలో మీకు చెప్తాను’’.. అంటూ తన తెలుగు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. అలాగే రామకృష్ణ స్టూడియోలోకి ఎంటర్ అవుతున్న వీడియోను కూడా షేర్ చేసింది. కాగా వరీనా, నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో నటిస్తోందని సమాచారం.

కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఆడిషన్ కోసం వరీనాను హైదరాబాద్ పిలిచారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి తన టాలీవుడ్ డెబ్యూ అన్నతోనా లేక తమ్ముడితోనా అనేది చెప్పకుండా నందమూరి అభిమానులను సస్పెన్స్‌లో పడేసిందీ పాప.