Washington Sundar Dog: వైరల్‌గా మారిన క్రికెటర్ కుక్క పేరు.. ఎందుకో తెలుసా?

సోషల్ మీడియా అంటే అదో మయా ప్రపంచం. ఫ్లాట్ ఫామ్ ఏదైనా.. మ్యాటర్ ఏదైనా.. ఎప్పుడు ఎందుకు ఏది వైరల్ అవుతుందో.. ఏది ట్రేడింగ్ లో నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ఇప్పుడు ఒక క్రికెటర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయిపోతుంది. అది కూడా ఆ క్రికెటర్ తన కుక్క పేరు చెప్తూ దాన్ని ఫోటో తీసి పెట్టిన పోస్టుకు లక్షల్లో లైకులు, షేర్లు సంపాదించి ట్రెండింగ్ అవుతుంది.

Washington Sundar Dog: వైరల్‌గా మారిన క్రికెటర్ కుక్క పేరు.. ఎందుకో తెలుసా?

Washington Sundar Dog

Washington Sundar Dog: సోషల్ మీడియా అంటే అదో మయా ప్రపంచం. ఫ్లాట్ ఫామ్ ఏదైనా.. మ్యాటర్ ఏదైనా.. ఎప్పుడు ఎందుకు ఏది వైరల్ అవుతుందో.. ఏది ట్రేడింగ్ లో నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు. కోట్ల మంది పనిగట్టుకొని ట్రెండింగ్ చేయాలని చూసినా సాధ్యం కానిది అనుకోకుండా.. ఏ మాత్రం అవగాహనా లేకుండా చేసిన పోస్టు కూడా వరల్డ్ ఫేమస్ అయిపోతుంది. అదే సోషల్ మీడియా గొప్పదనం. అలాంటిదే ఇప్పుడు ఒక క్రికెటర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయిపోతుంది. అది కూడా ఆ క్రికెటర్ తన కుక్క పేరు చెప్తూ దాన్ని ఫోటో తీసి పెట్టిన పోస్టుకు లక్షల్లో లైకులు, షేర్లు సంపాదించి ట్రెండింగ్ అవుతుంది.

టీమ్ ఇండియా ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సహజంగానే సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కనుక సుందర్ కూడా ట్విట్టర్ లో తరచుగా పోస్ట్స్ పెడుతుంటాడు. అలానే శనివారం తన కుక్క పేరు చెప్తూ ఒక ఫోటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆదివారానికి ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అత‌డు త‌న కుక్క‌ను ప‌రిచ‌యం చేస్తూ ట్విట‌ర్‌లో షేర్ పోస్ట్‌కు కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే వేల సంఖ్య‌లో కామెంట్స్‌, లైక్స్ వ‌స్తున్నాయి.

అసలు ఇంత‌కీ సుందర్ పెట్టిన పోస్టు అంతగా వైరల్ ఎందుకు అవుతుందో తెలుసా? ఆ కుక్కకు పెట్టిన పేరు వలనే. ఆయన త‌న కుక్క‌కు గ‌బ్బా అని పేరు పెట్టాడు. ఈ పేరు ఎక్క‌డో విన్నట్లుంది క‌దూ. మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న స్టేడియం పేరు గబ్బా. ఈ స్టేడియానికి సుందర్ ఆటకి ఒక లాజిక్ ఉంది. అందుకే సుందర్ కుక్కకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఈ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌తోనే అనుకోని ప‌రిస్థితుల్లో టెస్ట్ అరంగేట్రం చేసిన సుంద‌ర్ ఆ మ్యాచ్ లో ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టాడు.

ఈ మ్యాచ్‌లో సుందర్ నాలుగు వికెట్లు తీయ‌డమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 62, రెండో ఇన్నింగ్స్‌లో 22 ప‌రుగులు చేసి అరంగేట్ర మ్యాచ్‌తోనే అత‌డు పెద్ద హీరో అయిపోయాడు. అప్పటివరకు 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని కంగారూల‌ను ఇండియ‌న్ టీమ్ మ‌ట్టి క‌రిపించి ఇక్కడే చారిత్ర‌క విజ‌యాన్ని సాధించింది. అందుకే సుందర్ కు ఆ స్టేడియం అంటే అమితమైన ప్రేమ. కుక్క అన్నా అంతే ప్రేమ. అందుకే రెండూ కలిపి కుక్కకు పేరు పెట్టుకున్నాడు. అయితే.. ఇప్పుడు కుక్కను పరిచయం చేస్తూ పెట్టిన పోస్టు ఒక్కసారిగా అప్పటి మ్యాచ్ ను గుర్తు చేయడమే కాక క్రికెట్ అభిమానులకు ఒకింత కిక్కిచ్చింది. ఇంకేముంది లైకులు, షేర్లతో పోస్ట్ హోరెత్తుతోంది.