Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

అటవీ జంతువులేవైనా ఆహారాన్ని సంపాదించుకోవాలంటే విపరీతంగా కష్టపడాల్సిందే. కావాలంటే ఈ ఏనుగు కష్టాన్ని చూడండి. తనకిష్టమైన పనస పండ్లు తినేందుకు ఈ ఏనుగు ఎంతగా శ్రమించిందో. వీడియోపైనా ఓ లుక్కేయండి.

Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

Jackfruit

Jackfruit: ఏనుగులకు పండ్లంటే చాలా ఇష్టం. వాటిలో పనస పండు ఒకటి. అడవుల్లో తిరిగే ఏనుగులైతే పనస పండ్లను ఎంతో ఇష్టంగా తింటాయి. వాటికోసం ఎంతగానో కష్టపడతాయి. ఎక్కడైనా చెట్లకు పనస పండ్లు కనిపిస్తే కష్టపడి తెంచుకుని, తింటాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. వాటి కష్టం మీకే అర్థమవుతుంది.

Sex Reassignment Surgery: లింగమార్పిడి సర్జరీలపై మహిళా కమిషన్ నోటీసులు

తన కిష్టమైన పసన పండ్లు తినేందుకు ఆ ఏనుగు పడ్డ కష్టాన్ని చూసి ప్రశంసించకుండా ఉండలేరు. ఈ వీడియోలో ఒక ఏనుగు చెట్ల దారి గుండా వెళ్తుండగా, ఒక పనస చెట్టు కనిపిస్తుంది. దానికి కొన్ని పనస పండ్లు ఉన్నాయి. అయితే, అవి చాలా ఎత్తులో ఉన్నాయి. వాటిని తినాలనుకున్న ఏనుగు ఇందుకోసం చాలా శ్రమించింది. చెట్టుపైకి కాళ్లుపెట్టి, తొండం పైకెత్తి చాలా కష్టపడి పనస పండ్లను తెంపుకొని తిన్నది. ఈ ఘటన ఇండ్ల మధ్యే జరగడంతో అక్కడున్న వారు కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. చెట్టు పై నుంచి ఏనుగు పనస పండ్లను తెంపగానే, అక్కడున్న వారంతా సంతోషపడుతూ గోల చేయడం విశేషం.

5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. 1.5 లక్షల కోట్లు దాటిన బిడ్లు

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు. కానీ, ఈ వీడియోను సుప్రియా సాహూ అనే ఐఏఎస్ ఆఫీసర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఏనుగు కష్టాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 76 వేల మందికిపైగా చూశారు. మూడున్నర వేలకు పైగా లైకులు పొందింది ఈ వీడియో. కావాలంటే మీరూ ఈ వీడియో చూసేయండి.