Water Bottle: వాటర్ బాటిల్ విషయంలో గొడవ.. వ్యక్తిని ట్రైన్‌లో నుంచి తోసేసిన సిబ్బంది

రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ (12591) రైలులో రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. జిరోలీ గ్రామానికి చేరుకోగానే పాంట్రీ సిబ్బందితో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా తింటున్నాడని ప్రశ్నించాడు.

Water Bottle: వాటర్ బాటిల్ విషయంలో గొడవ.. వ్యక్తిని ట్రైన్‌లో నుంచి తోసేసిన సిబ్బంది

 

 

Water Bottle: రైల్వే పాంట్రీ స్టాఫ్ ఓ వ్యక్తిపై దాడి చేసి రైలులో నుంచి తోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా ఝాన్సీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ (12591) రైలులో రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. జిరోలీ గ్రామానికి చేరుకోగానే పాంట్రీ సిబ్బందితో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా తింటున్నాడని ప్రశ్నించాడు. గొడవ పెరగడంతో రవి యాదవ్ చెల్లి లలిత్‌పూర్ స్టేషన్ రాగానే రైలు దిగిపోయింది.

రవిని మాత్రం సిబ్బంది రైలు దిగనివ్వలేదు. దారుణంగా కొట్టడమే కాకుండా రైలులో నుంచి తోసేశారు కూడా. స్థానికులు అతణ్ని హాస్పిటల్ కు తరలించగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఝాన్సీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవి యాదవ్ కంప్లైంట్ మేర కేసు నమోదు చేసుకున్నారు.

Read Also: రూ.1500 కోసం గొడవపడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్

ఐపీసీ సెక్షన్లు 323, 325, 506 ప్రకారం.. పాంట్రీ స్టాఫ్ పై కేసు నమోదు చేసినట్లు గవర్నమెంట్ రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ మొహమ్మద్ నయీమ్ తెలిపారు. నిందితుల్లో ఒకరైన అమిత్ ను గుర్తుపట్టగా అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం విచారణ జరుపుతున్నారు.