Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
ad

Raghunandan Rao: హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం నుంచి నగరంలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రఘునందన్ రావు ప్రత్యేకంగా 10టీవీతో మాట్లాడారు.

Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు

‘‘బీజేపీకి పోటీగా సమావేశాలు నిర్వహించడం టీఆర్ఎస్ విజ్ఞతకే వదిలేస్తున్నా. యశ్వంత్ సిన్హాను కాకుండా, సోనియా గాంధీని తీసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. మేం సమావేశం నిర్వహిస్తుంటే మా కటౌట్ల పక్కన జెండాలు పెట్టడం మానుకోవాలి. ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్’ అనేది మా నినాదం. జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. అందులో తెలంగాణ కూడా ఉంటుంది. ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తాం’’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు

మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు కూడా టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘మేం సమావేశాలు నిర్వహించుకుంటుంటే టీఆర్ఎస్ ఎందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందో అర్థం కావడం లేదు. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 350 మంది కంటే ఎక్కువ మంది ప్రముఖులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మా నేతలంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కార్యవర్గ సమావేశాల్లో దేశ ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, విదేశాంగ విధానం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది’’ అని రాం చందర్ రావు అన్నారు.