ఖమ్మం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్

ఖమ్మం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Khammam

బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులను, శ్రేణులను అవమానిస్తున్నారని, కేంద్రంలోని పెద్దలతో సఖ్యతగా ఉన్నా కూడా రాష్ట్రంలో నేతల మాటలు జనసేన శ్రేణులను బాధపడుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, బలంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. శక్తి మేరకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జనసేన జన్మించింది. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. నేను పాలకులను, ప్రజలను వేరుగా చూస్తాను, రాజకీయం రెండు కులాల మధ్య నలిగిపోతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మార్పు ఒక్క రోజులో రాదు అని తెలుసు కాబట్టే నేను 25 సంవత్సరాలు అని మాట్లాడుతాను, ప్రజలు మనల్ని నమ్మడానికి సమయం పడుతుంది, మనం నిలబడితేనే గెలవగలం, మార్పు తీసుకురాగలం అని పవన్ కళ్యాణ్ అన్నారు.