హైపర్ రియలిస్టిక్ ఫేస్ మాస్క్‌లంట.. నచ్చిన వ్యక్తి రూపాన్ని ధరించవచ్చు!

హైపర్ రియలిస్టిక్ ఫేస్ మాస్క్‌లంట.. నచ్చిన వ్యక్తి రూపాన్ని ధరించవచ్చు!

Hyper-realistic masks to go on sale : జోకర్ మాస్క్‌లు పెట్టుకోవడం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నచ్చిన వ్యక్తి ఫేస్ మాస్క్ పెట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. ఒకరి రూపాన్ని మరొకరు పోలి ఉండేలా కొత్త ఫేస్ మాస్క్ లు వచ్చేశాయి. అవే.. హైపర్ రియలిస్టిక్ ఫేస్ మాస్క్‌లు.. ఎవరి రూపాన్ని అయినా మీరు ఈజీగా ఫేస్ మాస్క్‌లా ధరించవచ్చు.

ఇప్పుడీ ఈ రియలిస్టిక్ ఫేస్ మాస్క్ లకు ఫుల్ గిరాకీ పెరిగింది. జపాన్‌లో సేల్ కూడా మొదలైంది. ఆ దేశానికి చెందిన ఓ రిటైలర్ రియలిస్టిక్ ఫేస్ మాస్క్ లను తయారు చేస్తున్నాడు. షుహీ ఓకావారా డిజైన్ చేస్తున్న ఈ రియలిస్టిక్ ఫేస్ మాస్క్ లు మరో వ్యక్తి ముఖాన్ని పోలి ఉంటాయి.
face mask

మీకు నచ్చిన వ్యక్తి ఫొటోను ఇస్తే.. అతడు అచ్చం అలాంటి రూపాన్ని కలిగిన ఫేస్ మాస్క్ డిజైన్ చేసి ఇస్తాడు. అది ధరిస్తే.. మీరు కూడా వారిలోనే కనిపిస్తారు. మిమ్మల్ని ఎవరూ కూడా గుర్తుపట్టలేరు. అంతగా రియలిస్టిక్ గా ఉంటాయి. ఒక్కో మాస్క్‌ కోసం భారీమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో మాస్క్‌ ధర సుమారు 98,000 యెన్లు.. అంటే మన కరెన్సీలో రూ .69,832గా పలుకుతుంది.
ఈ రియలిస్టిక్ ఫేస్ మాస్క్‌లు వచ్చే ఏడాది ప్రారంభంలో టోక్యోలోని కామెన్యా ఓమోట్‌ షాపు వద్ద విక్రయించనున్నాడు. విదేశాల నుంచి భారీ మొత్తంలో ఈ మాస్క్ ల కోసం ఆర్డర్లు వస్తున్నాయంట.. అక్టోబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు.. ఇప్పటికే ఈ రియలిస్టిక్ ఫేస్ మాస్క్ ల కోసం 100 మందికి పైగా బుకింగ్ చేసుకున్నారంట..