Wedding Gown : ఫేస్ మాస్కులతో వెడ్డింగ్ గౌన్

పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో కరోనా కారణంగా మాస్కులను వినియోగించి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడేయటాన్ని గుర్తించిన హిచ్డ్ వాటిని సేకరించి వాటితో పెళ్ళి గౌన్ ను రూపొందించారు

Wedding Gown : ఫేస్ మాస్కులతో వెడ్డింగ్ గౌన్

Wedding Gown

Wedding Gown : కరోనాతో మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగింది. మాస్కులను ఉపయోగించిన తరువాత వాటిని రోడ్లపైనో, చెత్తబుట్టలోనే పడేయటం అందరికి అలవాటు. అయితే అలా పడేసే మాస్కులతో ఏకంగా పెళ్ళి గౌను రూపొందించారు….పర్యావరణానికి హాని కలిగుస్తున్న మాస్కుల వేస్టేజ్ పై అవగాహన కోసం చేసిన చిన్న ప్రయత్నం అందరిని ఆలోచింప చేసేదిగా మారింది.

యూకె లో వారానికి 100మిలియన్ల డిస్పోజబుల్ మాస్కులను రోడ్లపై పడేస్తున్నారు. కోవిడ్ ఆంక్షలు సడలింపులతో స్ధానికంగా ఫంక్షన్లు, వివాహాల తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో యూకేకు చెందిన వెడ్డింగ్ ప్లానర్, మార్కెటర్ హిచ్డ్ కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించింది.

పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో కరోనా కారణంగా మాస్కులను వినియోగించి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడేయటాన్ని గుర్తించిన హిచ్డ్ వాటిని సేకరించి వాటితో పెళ్ళి గౌన్ ను రూపొందించారు. ఈ గౌను తయారు చేసేందుకు 1500 వరకు అప్ సైకిల్డ్ ఫేస్ మాస్కులను వినియోగించారు. ఆఫ్ బీట్ బ్రైడల్ వేర్ గా తయారు చేసిన ఈ డ్రస్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ గౌన్ సోషల్ మీడియాలో తెగవైరల్ మారింది.

మాస్కులు ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని హిచ్డ్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహకల్పించేందుకు తాను ఇలా విన్నూత్న ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చారు. కోవిడ్ ఆంక్షలు ముగిసి తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొంటున్న నేపధ్యంలో వెరైటీగా ఉంటుందని ఇది చేపట్టినట్లు హిచ్డ్ చెప్పారు.