‘Wedding kits’ in Odisha: కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ‘వెడ్డింగ్ కిట్స్’ పథకం.. కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోములు

కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ఒడిశా ప్రభుత్వం ‘వెడ్డింగ్ కిట్స్’ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని ఒడిశా సర్కారు అమలు చేయనుంది. ఈ కిట్ల ద్వారా కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఈ కిట్లలో గర్భనిరోధక మాత్రలు, కండోములు, కుటుంబ నియంత్రణ ద్వారా చేకూరే ప్రయోజనాలు తెలిపే బుక్ లెట్, పెళ్ళి రిజిస్ట్రేషన్ పత్రం, ఇతర వస్తువులు ఉంటాయి.

‘Wedding kits’ in Odisha: కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ‘వెడ్డింగ్ కిట్స్’ పథకం.. కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోములు

'Wedding kits' in Odisha

‘Wedding kits’ in Odisha: కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ఒడిశా ప్రభుత్వం ‘వెడ్డింగ్ కిట్స్’ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని ఒడిశా సర్కారు అమలు చేయనుంది. ఈ కిట్ల ద్వారా కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఈ కిట్లలో గర్భనిరోధక మాత్రలు, కండోములు, కుటుంబ నియంత్రణ ద్వారా చేకూరే ప్రయోజనాలు తెలిపే బుక్ లెట్, పెళ్ళి రిజిస్ట్రేషన్ పత్రం, ఇతర వస్తువులు ఉంటాయి.

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) నయీ పహల్ పథకం కింద ప్రవేశపెడుతున్నట్లు ఒడిశా సర్కారు తెలిపింది. ఈ పథకాన్ని జిల్లాలు, బ్లాక్‌ల స్థాయుల నుంచి ప్రారంభిస్తామని చెప్పింది. ఇటువంటి పథకాన్ని ప్రారంభించడం దేశంలోనే తొలిసారి అని తెలిపింది. వివాహం జరుగుతోన్న చోటుకు వెళ్ళి ఆశా వర్కర్లు ఈ కిట్లను అందజేస్తారని చెప్పింది.

పిల్లలను కనడం మధ్య ఎంత సమయం ఇవ్వాలన్న విషయంపై కూడా అవగాహన కల్పిస్తారని పేర్కొంది. దేశ జనాభా త్వరలోనే చైనాను మించి పోయే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతోన్న విషయం తెలిసిందే. జనాభాకు తగ్గ వనరులు ఉండడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంది.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం