Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి

కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బ‌ృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్‌కు, రేష్మకు వివాహం జరిగింది.

Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి

Kannada Songs

Kannada songs: కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బ‌ృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్‌కు, రేష్మకు వివాహం జరిగింది. పెళ్లి అనంతరం నూతన దంపతులు, తమ బంధువులతో కలిసి రాత్రిపూట కన్నడ పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ, కన్నడ జెండాలతో ఊరేగింపుగా వెళ్ళారు. ఈ ఊరేగింపు చన్నమ్మ నగర్ చేరుకోగానే అక్కడికి మహారాష్ట్ర ఎకికారన్ సమితి (ఎమ్ఈఎస్) కార్యకర్తలు వచ్చారు. కన్నడ పాటలు పెట్టుకున్నందుకు పెళ్లి బృందాన్ని అడ్డుకున్నారు. నూతన దంపతులతోపాటు పెళ్లి బృందంపై దాడి చేశారు.

Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ

ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కొందరు అనుమానితులను తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా స్పందించారు. ఎమ్ఈఎస్ చర్యను ఖండించారు. ‘‘ఎమ్ఈస్ చర్యను ఖండిస్తున్నాను. ఇప్పటికే పోలీసులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఈ అంశంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాం. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా ఊరుకోం. కన్నడిగులు ఏ సమస్యలో ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని బొమ్మై వ్యాఖ్యానించారు.