Union Cabinet : రేపు సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ జాబితా వెల్లడి?

బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.. ఉన్నత విద్యావంతులకు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పులో వెనుకబడిన వర్గాలవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కేంద్ర వర్గాల నుంచి సమాచారం. ఇక అన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం.

Union Cabinet : రేపు సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ జాబితా వెల్లడి?

Union Cabinet 1

Union Cabinet : బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.. ఉన్నత విద్యావంతులకు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పులో వెనుకబడిన వర్గాలవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కేంద్ర వర్గాల నుంచి సమాచారం. ఇక అన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం.

కాగా జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ పశుపతి పరాస్, నారాయణ్ రాణే, వరుణ్ గాంధీలకు మంత్రి పదవులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు ఢిల్లీ బయలుదేరారు అంతకు ముందు ఆయన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇక అస్సాంలో బీజేపీ విజయం సాధించిన తర్వాత హిమంత బిస్వా శర్మ కోసం తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న సర్బానంద సోనోవాల్ కు కేంద్ర మంత్రి పదవి దక్కనుంది.

తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దినేష్ త్రివేది, జితిన్ ప్రసాదలకు కూడా కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తుంది. 81 మంది కేంద్ర మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మంది మంత్రులే ఉన్నారు. మరో 28 మంది మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉంది. కాగా తాజా మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదాలో ఆరుగురు, మంత్రులుగా 20 మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

కాబోయో మంత్రులు…!!

జ్యోతిరాదిత్య సింధియా ( మధ్య ప్రదేశ్), సర్బానంద సోనోవాల్ ( అస్సాం), నారాయణ రాణే ( మహారాష్ట్ర), అనుప్రియా పటేల్ ( ఉత్తర్ ప్రదేశ్ ), పంకజ్ చౌధురి ( ఉత్తర్ ప్రదేశ్), రీటా బహుగుణ జోషి ( ఉత్తర్ ప్రదేశ్), రామశంకర్ కథేరియా ( ఉత్తర్ ప్రదేశ్), వరుణ్ గాంధీ
( ఉత్తర్ ప్రదేశ్), పశుపతి పారస్ ( బీహార్), ఆర్.సి.పి. సింగ్ ( బీహార్), లల్లన్ సింగ్ ( బీహార్), రాహుల్ కశ్వన్ ( రాజస్థాన్), యువ ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి ( రాజస్థాన్).

“భారతీయ జనతా యువ మోర్చా” నుంచి అంచెలంచలుగా ఎదిగిన నాయకుడు

వైజయంత్ పాండా ( ఒడిస్సా), కైలశ్ విజయవర్గీయ ( మధ్యప్రదేశ్)