dry fasting : పొడి ఉపవాసం అంటే ఏమిటి? ఉపయోగాలు, దుష్ర్పభావాలు

ఉపవాసాల్లో చాలా రకాలున్నాయి.వాటిలో బరువు తగ్గటం కోసం చాలామంది పొడి ఉపవాసంచేస్తుంటారు. దీని వల్ల ఉపయోగాలేంటీ?అది బరువు తగ్గటానికి ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల ఉపయోగాలేంటీ దుష్ర్పభావాలేంటో తెలుసుకుందాం..

dry fasting : పొడి ఉపవాసం అంటే ఏమిటి? ఉపయోగాలు, దుష్ర్పభావాలు

Dry Fasting

Weight loss..What is dry fasting? : ఉపవాసం పరమ ఔషధం అని పెద్దలు చెబుతుంటారు.అసలు ఉపవాసం అంటే? ఉపవాసాల్లో లో 4 రకాలు ఉన్నాయి. అవి నిర్జలోపవాసం, జలోపవాసం,రసోపవాసం,ఫలోపవాసం, నిర్జలోపవాసం. ఉపవాసాలు ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులలో భాగంగా ఉంది. నిర్జలోపవాసం అంటే మంచినీరు కూడా ముట్టకుండా చేయటాన్ని నిర్జలోపవాసం అంటారు. జలోపవాసం అంటే కేవలం మంచినీరు మాత్రమే తాగి చేసే ఉపవాసం. రసోపవాసం అంటే సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఇక ఫలోపవాసం అంటే కేవలం రసము నిండిన పండ్లు మాత్రమే ఆహారంగా తీసికొని చేసే ఉపవాసాన్ని రసోపవాసం అంటారు. ఈ సరోపవాసంలో అరటిపండు తీసుకోకూడదు. కేవలం రసాలు ఉండే పండ్లే తీసుకోవాలి. అంటే బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ వంటి రసం ఉండే పండ్లే తినాలి.

పొడి ఉపవాసం..
ఈ ఉపవాసాలు పద్దతి ఇలా ఉంటే మనం ఇప్పుడు చెప్పుకునేది పొడి ఉపవాసం. పొడి ఉపవాసం అంటే…ఒక నిర్దిష్ట సమయం వరకు ఆహారం తినకుండా ఉండటం. చాలా రకాల ఉపవాసాలతో, నీరు, కాఫీ మరియు టీ వంటి ద్రవాలు సేవించవచ్చు. పొడి ఉపవాసం అంటే అన్ని ఆహారాలు మరియు ద్రవాలు పరిమితం చేయబడతాయి. పొడి ఉపవాసం సాధారణంగా మతపరమైన లేదా ఆధ్యాత్మిక పద్ధతుల్లో పాటిస్తుంటారు. బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

పొడి ఉపవాసం అనేది చాలా రకాల ఉపవాసాలకు భిన్నంగా ఉంటుంది.పొడి ఉపవాసం లేదా సంపూర్ణ ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం ఆహారమే కాదు ద్రవాలను కూడా పరిమితం చేస్తుంది. నీరు, ఉడకబెట్టిన పులుసు, టీతో సహా ఎటువంటి ద్రవాలను తీసుకోకూడదు. అంటే జీరో క్యాలరీలు ఉన్నదాన్ని తీసుకోవాలి.అంటే నీరు వంటివి.చక్కెర, పాలు లేని కాఫీ తాగొచ్చు. ఈ పొడి ఉపవాసంలో రెండు రకాలున్నాయి. ఒకటి సాప్ట్ డ్రై ఫాస్టింగ్, రెండోది హార్డ్ డ్రై ఫాస్టింగ్. దీంట్లో సాఫ్ట్ డ్రై ఫాస్టింగ్ లో పళ్లు తోముకోవటానికి, స్నానం చేయటానికి, ముఖం కడుక్కోవటానికి నీటిని ఉపయోగించవచ్చు. ఇక రెండోది హార్డ్ డ్రై ఫాస్టింగ్ అంటే నీటితో అస్సలు సంబంధం ఉండదు. అంటే అస్సలు నీటిని ఏరకంగాను ఉపయోగంచకూడదు.

పొడి ఉపవాసం ఎలా పనిచేస్తుంది?
శరీరానికి నీరు అందనప్పుడు అంటే పొడి ఉపవాసం ఉన్నప్పుడు అది శక్తిని ఉత్పత్తి చేయడానికి కొవ్వును కరిగించటం ప్రారంభిస్తుందని అంటారు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఒత్తిడిని కలిగి అంతర్గత వ్యవస్థను కొనసాగించడానికి అందుబాటులో ఉన్న ప్రతి శక్తి వనరును ఉపయోగించడం ప్రారంభిస్తుంది.పొడి ఉపవాసం పాడైపోయిన కణాలను తొలగించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. దీంతో శరీరం కొత్త కణాలను పునరుత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. పదేపదే ఉపవాసం ఉండటం వల్ల మంటను తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యకంగా తయారవుతుంది.

ఉపవాసు ఎక్కువసేపు ఉండటం వల్ల దుష్ప్రభావాలు..
అలసటగా అనిపిస్తుంది. శరీరంలో తగినంత వాటర్ కంటెంట్ లేనప్పుడు..అలసటకు గురవుతారు. మైకం కమ్ముతుంది.బలహీనంగా అనిపిస్తుంది. అలాగే ఆకలి బాగా వేస్తుంది. ఆహారం,నీరు రెండింటిని తీసుకోకపోతే..ఆకలి మరింతగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. దీంతో రెగ్యులర్ గా తినేదాని కంటే ఎక్కువే తినొచ్చు. ఉపవాసంలో ఉన్నప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. మూడ్ అవుట్ అయిపోవచ్చు. అలాగే ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఇంకా తలనొప్పిగా అనిపిస్తుంది. పోషకాలను పరిమితం చేయడం వల్ల తలనొప్పికి దారితీస్తాయి. కొన్ని సందర్బాల్లో ఉపవాసం వల్ల మూర్ఛ, మెదడు వాపు, మూత్రపిండాల వైఫల్యాలు కూడా రావచ్చంటున్నారు.

పొడి ఉపవాసం ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?
ముందుగా ఉన్న ఏవైనా వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పొడి ఉపవాసం చేయకూడదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఇటువంటి ఉపవాసాలు చేయకూడదు.ఈ ఉపవాస పద్ధతిని ప్రయత్నించే ముందు ఆరోగ్యవంతమైన వ్యక్తి కూడా నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవటం చాలా అవసరం.