ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల లిస్టు..! డిజిటల్ ఇండియా పెళ్లంటే ఇదేనా..!

ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల లిస్టు..! డిజిటల్ ఇండియా పెళ్లంటే ఇదేనా..!

wedding food menu aadhaar card : నేటి యువత ట్రెండ్ ను ఫాలో అవ్వటమే కాదు ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డులో కొత్త పంథాకు నాంది పలికారు. అటువంటి ఓ జంట డిజిటల్‌ ఇండియాకు మద్దతునిస్తూ తమ వెడ్డింగ్ కార్డుని వెరైటీగా డిజైన్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ జంట ‘ఆధార్’కార్డులాగా తమ వెడ్డింగ్ కార్డుని డిజైన్ చేసుకున్నారు. అంతేకాదు ఆ ‘ఆధార్’(వెడ్డింగ్ కార్డు)లోనే తమ పెళ్లికి పెట్టే విందు భోజనాల లిస్టును ప్రింట్ చేయించారు.

అచ్చం ఆధార్‌ కార్డును పోలిన ఈ వెడ్డింగ్‌ మెను కార్డును వారి సోషల్ మీడియా ఎకౌంటులో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అచ్చం ఆధార్‌ కార్డును పోలీన ఈ కార్డులో పెళ్లి భోజనాల జాబితా ఉండటంతో ఇక అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం ఈ కార్డు చక్కర్లు కొడుతోంది. ఈ కార్డుని అందుకున్న వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వరుడు గోగోల్‌ షాహా, వధువు సుబర్ణ దాస్‌ల వివాహం ఫిబ్రవరిలో 1 (సోమవారం) జరిగింది. అయితే వీరి పెళ్లికి వచ్చిన అతిథుల కోసం విందు అందించటానికి ఈ జంట వారి వెడ్డింగ్ కార్డుని అచ్చం ఆధార్‌ కార్డుల తయారు చేయించి వివాహ భోజనాల లిస్టుని కూడా ప్రింట్ చేయించారు.

ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డు గురించి కొత్త పెళ్లికొడుకు గోగోల్‌ మాట్లాడుతూ..‘ఇది నా భార్య సుబర్ణ దాస్‌ కు వచ్చిన ఐడియా అనీ..డిజిటల్‌ ఇండియాకు మేము మద్దుతుగా నిలవాలనుకున్నాం. దానికి మా పెళ్లినే వేదిక చేయాలనుకున్నాడు. అందుకే మా వెడ్డింగ్ మెను‌ కార్డును ఆధార్‌ కార్డులా తయారు చేయించి డిజిటల్‌ ఇండియా మద్దతునిచ్చాం’ అని తెలిపాడు.

ఇక వారి పెళ్లి ఆధార్‌ కార్డు మెనును చూసి బంధువులంతా షాకవుతున్నారు. ‘ప్రస్తుత కాలంలో పెళ్లికి రావాలంటే కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి అయ్యింది’ అంటూ ‘మా ఆధార్‌ కార్డును డైనింగ్‌ టెబుల్‌ దగ్గర మర్చిపోయాం’ అంటూ బంధువులంతా చమత్కరించారని గోగోల్ నవ్వుతూ చెప్పాడు. భలే ఉంది కదూ వీరి వెరైటీ వెడ్డింగ్ కార్డ్..కాదు కాదు ఆధార్ కార్డ్..