ప్రెస్‌మీట్‌లో మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ..!! బీజేపీ ఎంపీ కౌంటర్

ప్రెస్‌మీట్‌లో మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ..!! బీజేపీ ఎంపీ కౌంటర్

mp kalyan banerjee pulls cheeks of tmc woman mla : పశ్చిమ బెంగాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఓ ఎంపీ పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అధికారంలో ఉన్న టీఎంసీ మరోసారి అధికారం చేపట్టాలనీ..మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ హోరా హోరీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ లతో ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూ వేడెక్కిస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈక్రమంలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటువంటి హాట్ హాట్ వాతావరణంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ..తమ పార్టీకే చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం టీఎంసీకి కాస్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని సీఎం మమతా బెనర్జీ బీజేపీతో పోరాడుతుంటే ఈ ఘటన ఆమెకు తలనొప్పిలా తయారైంది.

ఈ వీడియోను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. దానికి ‘‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీ బాన్‌కురా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడని పేర్కొన్నారు. టీఎంసీకి చెందిన కొందరు నాయకులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఎంపీ కల్యాణ్‌తో పాటు ఎమ్మెల్యే అలోక కూడా హాజరయ్యారు. ఈక్రమంలో మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఎమ్మెల్యే బుగ్గను గిల్లారు ఎంపీ కల్యాణ్. అసలు ఈ ఎన్నికల్లో సారి ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ ఘటనతో బీజేపీ టీఎంసీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వీడియో బీజేపీ నేత షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్‌పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ..‘ఆమె తన డర్టీ మైండ్‌ను బయటపెట్టుకున్నారు. అన్నా చెల్లెలి రిలేషన్ ఏంటో ఆమె తెలుసుకోవాలని సుద్దులు చెప్పారు. నేను కూడా బాన్‌కురా నియోజకవర్గానికి చెందిన వాడినే. 25 ఏళ్లుగా ఆమెను సొంతచెల్లిగా చూసుకుంటున్నా. డర్టీ మైండ్ ఉన్న లాకెట్ ఛటర్జీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి.” అని ట్వీట్ చేశారు.

TMC empowering women…?

This is TMC MP Kalyan Banerjee and the woman is outgoing Bankura MLA who was miffed for not getting a ticket.

Shame! pic.twitter.com/JUXsZerN6i
— Locket Chatterjee (@me_locket) March 9, 2021