గచ్చిబౌలి దివాకర్.. బ్రహ్మానందంను వాడేసిన సన్‌రైజర్స్

గచ్చిబౌలి దివాకర్.. బ్రహ్మానందంను వాడేసిన సన్‌రైజర్స్

వాడేసుకోండి.. వాడుకున్నోడి వాడుకున్నంత.. ఇది ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్.. కానీ సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఫోటోల వాడకం మాములుగా ఉండదు.. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఐపీఎల్ ప్రాంఛైజ్‌లు కూడా బ్రహ్మానందాన్ని తెగ వాడేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా రాజస్థాన్‌ రాయల్స్‌ ఓ నలుగురి ఫొటోలను ట్వీట్ చేసి ఇందులో ఎవరినైనా ఎంచుకోవాలని సన్‌రైజర్స్‌కు సూచించింది. ఆ ట్వీట్‌లో లగాన్‌ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌, తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా నటుడు దిలీప్‌ జోషి, మరో ఇద్దరు సినిమా క్రికెటర్లు ఉన్నారు.


అయితే ఈ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తనదైన శైలిలో బదులిచ్చింది. ఆర్‌ఆర్ ట్వీట్‌కు సన్‌రైజర్స్ ఇచ్చిన కౌంటర్‌లో మా క్రికెటర్‌ను ఎంపిక చేసుకున్నాం అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి బ్రహ్మానందం GiF ఫైల్‌ను పోస్ట్‌ చేసింది. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌ క్యారెక్టర్ ఎంతలా నవ్వులను పండిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


లోకల్ అని చెప్పే క్రమంలో ఆ చిత్రంలోని ఫైల్‌నే సన్‌రైజర్స్ అభిమానులతో పంచుకుంది. మా జట్టులోకి గచ్చి బౌలి దివాకర్‌ను తీసుకున్నామని చెప్పకనే చెప్పి రాజస్థాన్‌కు పంచ్ ఇచ్చింది. సన్‌రైజర్స్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గచ్చిబౌలి దివాకర్ క్రికెట్ ఆడడమే కాదు.. క్రికెటర్లను ఎంకరేజ్ చేయడంలోనూ ముందుంటాడు. ఈ విధంగా మెమర్స్ మాదిరిగా బ్రహ్మానందంను వాడేసుకుంది సన్‌రైజర్స్.