Fruits: పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. తెలుసుకోండి!

పండ్లకు ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో మీకు పని ఉండదనే ఉదాహరణలకు కూడా మనం ఇప్పటికే చాలా విన్నాం. రోజూ మన ఆహరంలో పండ్లను తీసుకుంటే చర్మం నిగారింపుతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా అందుతాయని డైటీషియన్లు చెప్తారు. అయితే పండ్లను తీసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Fruits: పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. తెలుసుకోండి!

What Happens If You Drink Water After Eating Fruits Find Out

Fruits: పండ్లకు ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో మీకు పని ఉండదనే ఉదాహరణలకు కూడా మనం ఇప్పటికే చాలా విన్నాం. రోజూ మన ఆహరంలో పండ్లను తీసుకుంటే చర్మం నిగారింపుతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా అందుతాయని డైటీషియన్లు చెప్తారు. అయితే పండ్లను తీసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లను తినేప్పుడు నీటిని తాగొచ్చా.. పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే ఏమవుతుంది.. అసలు పండు తిన్న తర్వాత ఎంత సమయం తర్వాత నీరు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తీసుకుందాం.

పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చెప్తారు. పండ్లు తిన్న తర్వాత కనీసం అరగంట తర్వాత మాత్రమే నీళ్లు తీసుకోవచ్చని.. వీలైతే నలభై ఐదు నిమిషాల వరకు నీరు తీసుకోకపోవడం మరీ మంచిదని చెప్తారు. ఎందుకంటే పండ్లు విపరీతమైన హైడ్రేటింగ్ శక్తిని కలిగి ఉండడంతో పాటు శరీరానికి తగినంత నీటి వనరులను కలిగి ఉంటాయి. కనుక ఆ సమయంలో నీటితో శరీరానికి అవసరం ఉండదని డాక్టర్లు చెప్తారు. ఒకవేళ పండు తిన్న తర్వాత మీకు దాహం అనిపిస్తే కనీసం 30 నిమిషాలు వేచి ఉండటం మంచిదని వైద్యులు, డైటీషియన్లు చెప్తున్నారు.

అయితే.. అసలు పండుతిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది.. అసలు ఎందుకు డాక్టర్లు ఎందుకు తాగొద్దని చెప్తున్నారంటే.. అలా పండుతిని నీరు తాగితే అవసరమైన జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేయడం ద్వారా నీరు జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ ఆమ్లాలను పలుచన చేసి జీర్ణంకాని ఆహారం ఎక్కువ కాలం జీర్ణమయ్యేలా చేస్తుంది. అంటే అలా జీర్ణం కాని ఆహారాన్ని తరువాత జీర్ణించుకోవడానికి కడుపు రెండుసార్లు ప్రయత్నించాలనమాట. అందుకే పండు తిన్న తర్వాత కొంత సమయం ఇస్తే అది జీర్ణమైపోతుంది. అప్పుడు నీరు తాగితే శరీరం మరింత హైడ్రేట్ అయి మరింత ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు.