Oxygen Concentrator: ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ ఏది మంచిది.. ఎలా కొనాలి: గుర్తుంచుకోవాల్సిన చిట్కాలివే..

మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరోగ్యం విషమించిన రోగులకు వెంటిలేటర్ల మీద చికిత్స, ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది.

Oxygen Concentrator: ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ ఏది మంచిది.. ఎలా కొనాలి: గుర్తుంచుకోవాల్సిన చిట్కాలివే..

Oxygen Concentrator

Oxygen Concentrator: మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరోగ్యం విషమించిన రోగులకు వెంటిలేటర్ల మీద చికిత్స, ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. కానీ బెడ్ల కొరతతో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఏర్పడ్డ ఆక్సిజన్ డిమాండ్‌ను అధిగమించేందుకు కొందరు Oxygen Concentratorను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్లో ఎక్కడ చూసినా వీటిని అందించే కంపెనీలు నో స్టాక్ బోర్డులు పెట్టేయగా వినియోగదారులు మాత్రం కాన్సన్‌ట్రేటర్‌ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, అసలు Oxygen Concentrator అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Oxygen Concentrator

Oxygen Concentrator

Oxygen Concentrator అంటే ఏంటి?
Oxygen Concentrator అనేది ఒక మెడికల్ డివైజ్. ఇది గాలి నుంచి ఆక్సిజన్‌ను విడదీసి రోగులకు నేరుగా అందిస్తుంది. సాధారణంగా వాతావరణంలో ఉండే గాలిలో 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. 21 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఒక శాతం వరకు విష వాయువులు కూడా ఉంటాయి. Oxygen Concentrator ఈ సహజ గాలి నుంచి కేవలం ఆక్సిజన్‌ను విడదీసి రోగికి అందించి మిగతా వాయువులను తిరిగి గాలిలోకి వదిలేస్తాయి. ఈ పరికరాలు నిరంతరాయంగా నిమిషానికి ఒక లీటరు నుండి నిమిషానికి 10 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను సరఫరా చేయగలవు. దీని స్వచ్ఛత 87 నుండి 95 శాతం వరకు ఉంటుంది.

Oxygen Concentrator

Oxygen Concentrator

కరోనా రోగులకు Oxygen Concentrator ఏది మంచిది?
నిమిషానికి ఐదు లీటర్ల ఆక్సిజన్‌ను అందించే పరికరాల నుంచి వచ్చే ప్రాణవాయువు స్వచ్ఛత కనీసం 92-95 శాతం ఉండాలి. 50 శాతం స్వచ్ఛత ఉండే ఆక్సిజన్‌ను అందించేవి చికిత్సకు పనికిరావు. కరోనా రోగులకు 90 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను నిమిషానికి 1-5 లీటర్ల మేర అందించే Oxygen Concentrator అవసరమవుతుంది. శ్వాససమస్య ఎక్కువగా ఉన్నవారికి 10 లీటర్ల కంటే అధిక సామర్థ్యం ఉన్నవి కూడా కావాల్సి ఉంటుంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించాలంటే Oxygen Concentrator బరువు 15-19 కిలోలు ఉండాలి. కనీసం 5 లీటర్ల అవుట్‌పుట్‌ ఫ్లో ఉంటూ 90 శాతం ఆక్సిజన్‌ స్వచ్ఛత ఉండాలి. ఇలా బరువుంటేనే ఆక్సిజన్‌ స్వచ్ఛత ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. సాధారణంగా సీఓపీడీ రోగులకు చిన్న పాటి ఓసీలు(5-10 కిలోలు) సరిపోతాయి. కరోనా రోగులకు మాత్రం మధ్య స్థాయి(15-19 కిలోలు); పెద్ద స్థాయి(20 కిలోలు) ఓసీలు అవసరమవుతాయి. చిన్న ఓసీలు 30 శాతం ఆక్సిజన్‌ను మాత్రమే ఇస్తాయి. అంటే కేవలం గాలి వీస్తున్నట్లు ఉంటుంది. అది కరోనా రోగుల అవసరాలను తీర్చదు. ఓసీపై 90-30 శాతం ఆక్సిజన్‌, నిమిషానికి 1 లీటరు లేదా నిమిషానికి 2 లీటర్లకు అని ఉంటే దానర్థం .. 1 లీటరు ఫ్లో లేదా 2 లీటర్ల ఫ్లో ఉన్నపుడు మాత్రమే 90 శాతం ఆక్సిజన్‌ ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఫ్లో ఉంటే అది 30 శాతానికి ఆక్సిజన్‌ పడిపోతుందన్నమాట. అందుకే 20కిలోలు అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే ఓసీలు 1 లీటరు నుంచి 10 లీటర్ల ఫ్లో వరకు 90 శాతం ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇటువంటి వాటిని ఒకే మెషీన్‌పై ఇద్దరు రోగులకు కూడా అందించవచ్చు.

Oxygen Concentrator (1)

Oxygen Concentrator (1)

Oxygen Concentrator ఎలా కొనాలి?

healthgenie, healthklin, Nightingales India వంటి అనేక వెబ్‌సైట్లు భారతదేశంలో Oxygen Concentrator విక్రయిస్తున్నాయి. ఈక్వినాక్స్, ఆక్స్ లైఫ్, ఇనోజెన్, ఆస్పెన్, ఓసిఎం, ఫిలిప్స్, నిడెక్, ఆక్సిబ్లిస్, ఎయిర్‌సెప్, డెవిల్‌బిస్ వంటి బ్రాండ్‌లు మెడికల్ డివైజ్‌లను తయారు చేస్తుండగా ఈ బ్రాండ్ Oxygen Concentrator పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. Oxygen Concentrator కొనుగోలు చేయడానికి ముందు మీరు జాగ్రత్త విషయం తెలుసుకొని అవసరమైతే వైద్యుల అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి. కొన్ని వెబ్‌సైట్లు నెబ్యులైజర్లు, హ్యూమిడిఫైయర్‌ల వంటి పరికరాలను కూడా Oxygen Concentrator ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా Oxygen Concentrator కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని వివరాలను కనుగొని వెళ్ళాలి. నకిలీ పరికరాలను కొని మోసపోతే.. ఇటు రోగి అవసరం తీరకపోగా డబ్బు వృధా అవుతుంది.

Read: Netflix movies: ఈ సమ్మర్ నెట్‌ఫ్లిక్స్ హంగామా.. వారానికో హాలీవుడ్ సినిమా విడుదల!