Teacher recruitment scam: బెడ్రూం, బాత్రూంలో కోట్లాది రూపాయ‌లు.. ఇలా లెక్క‌పెట్టిన అధికారులు

మొత్తం 13 గంట‌లు.. ఎనిమిది మంది బ్యాంకు అధికారులు.. నాలుగు క్యాష్ కౌంటింగ్ మిష‌న్లు.. ఇవ‌న్నీ ఏంటీ? అనుకుంటున్నారా? ప‌శ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన న‌గ‌దు, బంగారం లెక్క‌పెట్ట‌డానికి ప‌ట్టిన స‌మ‌యం, ఆమె ఇంటికి వెళ్ళిన బ్యాంకు అధికారులు, వాడిన క్యాష్ కౌంటింగ్ మిష‌న్ల లెక్క ఇది. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ అధికారులు ఇవాళ తెల్ల‌వారుజామున జ‌రిపిన సోదాలు, ఆ స‌మ‌యంలో ప‌ట్టుబ‌డ్డ న‌గ‌దుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Teacher recruitment scam: బెడ్రూం, బాత్రూంలో కోట్లాది రూపాయ‌లు.. ఇలా లెక్క‌పెట్టిన అధికారులు

Money

Teacher recruitment scam: మొత్తం 13 గంట‌లు.. ఎనిమిది మంది బ్యాంకు అధికారులు.. నాలుగు క్యాష్ కౌంటింగ్ మిష‌న్లు.. ఇవ‌న్నీ ఏంటీ? అనుకుంటున్నారా? ప‌శ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన న‌గ‌దు, బంగారం లెక్క‌పెట్ట‌డానికి ప‌ట్టిన స‌మ‌యం, ఆమె ఇంటికి వెళ్ళిన బ్యాంకు అధికారులు, వాడిన క్యాష్ కౌంటింగ్ మిష‌న్ల లెక్క ఇది. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇవాళ తెల్ల‌వారుజామున జ‌రిపిన సోదాలు, ఆ స‌మ‌యంలో ప‌ట్టుబ‌డ్డ న‌గ‌దుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అర్పితా ముఖ‌ర్జీ ఫ్లాటులో రూ.27.9 కోట్లు, ఆరు కిలోల బంగారం ఈడీ అధికారుల‌కు ల‌భ్య‌మయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె ఇళ్ళ‌ల్లో దొరికిన న‌గ‌దు రూ.49.8 కోట్ల‌కు చేరింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈడీ అధికారుల బృందం బెల్గరియాలోని రత్తాలోని ఉండే క్ల‌బ్ టౌన్ హైట్స్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు వెళ్ళారు. ఈ కాంప్లెక్స్‌లో అర్పితా ముఖ‌ర్జీకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. మొద‌టి 1,751 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్. ఇది రెండో బ్లాకులో మొద‌టి అంత‌స్తులో ఉంది. రెండోది 1385 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్, ఇది ఐదో బ్లాకులో ఎనిమిదో అంత‌స్తులో ఉంటుంది.

ఈ రెండింటినీ ఆమె 2017లో కొన్నారు. మొద‌టి ఫ్లాట్‌లో అనుమానాస్పందంగా ఈడీ అధికారుల‌కు ఏమీ క‌న‌ప‌డ‌లేదు. రెండో ఫ్లాటును డోరును ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి బెడ్రూం తాళాన్ని ప‌గుల‌కొట్టారు. లోప‌లికి వెళ్ళాక‌ రూ.2.000, రూ.500 నోట్ల క‌ట్ట‌లు క‌న‌ప‌డ్డాయి. క‌ప్‌బోర్డులోని సంచుల్లో అవి ఉన్నాయి. బాత్రూంపై భాగంలోనూ ధ్వంసం చేసి చూడ‌గా అక్క‌డ కూడా న‌గ‌దు క‌న‌ప‌డింది. భారీ మొత్తంలో న‌గ‌దు బ‌య‌ట‌ప‌డ‌డంతో అధికారులు సాయంత్రం 4.30 గంట‌ల‌కు నాలుగు పెద్ద పెద్ద‌ క‌రెన్సీ కౌంటింగ్ మిష‌న్‌ల‌ను తెప్పించారు.

ఆ డ‌బ్బును పూర్తిగా లెక్కించే స‌రికి గురువారం తెల్లారింది. గురువారం ఉద‌యం 5.30 గంట‌ల‌కు న‌గ‌దు, బంగారం లెక్క తేల్చామని అధికారులు వివ‌రించారు. బెడ్రూంను తెర‌వ‌గానే క‌రెన్సీ క‌ట్ట‌లు క‌న‌ప‌డ్డాయ‌ని చెప్పారు. రూ.27.9 కోట్ల న‌గ‌దు, రూ.4.31 కోట్ల విలువ చేసే బంగారాన్ని బెడ్రూం, వాష్ రూంలో దొరికాయ‌ని వివ‌రించారు. ఆ డ‌బ్బు, బంగారాన్ని ట్ర‌క్కులో ఎస్‌బీఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి త‌ర‌లించారు.

India vs West Indies: 98 ప‌రుగులు చేశాక వ‌ర్షం ప‌డ‌డంపై శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి