Healthy Weight : పిల్లల ఆరోగ్యవంతమైన బరువు కోసం ఎలాంటి ఆహారం అందించాలంటే?

ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్‌ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి.

Healthy Weight : పిల్లల ఆరోగ్యవంతమైన బరువు కోసం ఎలాంటి ఆహారం అందించాలంటే?

Healthy Weight Of The Child

Healthy Weight : పిల్లల వయస్సు పెరిగే కొద్దీ బరువు పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం వయస్సు పెరుగుతున్నా బరువు మాత్రం పెరగరు. ఉంటారు. వయస్సు పెరుగుతున్న పిల్లలు బరువు తక్కువగా ఉన్నారంటే, వారు తగిన ఆహారం తీసుకోవడం లేదని, ఒక వేళ తీసుకున్నా శరీరానికి వంటపట్టటం లేదని అర్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పిల్లలు ఆరోగ్యంగా,దృడంగా ఎదగాలంటే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. తగినంత బరువు లేకపోతే పిల్లల్లో మానసిక వికాసం కూడా సరిగా ఉండదు. చదివినవి గుర్తు ఉండదు. అందువల్ల వారు తినే ఆహారం మీద దృష్టి పెట్టడం అవసరం. పిల్లల ఎదుగుదలకు, బరువు పెంపుకు తోడ్పడే ఆహారల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పిల్లల ఇష్టాన్ని గ్రహించి వారికి నచ్చిన ఆహారాన్ని పిల్లలకు బుజ్జగించి మరి తినిపించాలి. పప్పు, నెయ్యి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎగ్స్‌లో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని క్రమబద్ధీకరించడంలో గుడ్లు ఎంతో సాయం చేస్తాయి. పిల్లలకి చికెన్‌ హై క్యాలరీ, హై ప్రొటీన్‌ ఫుడ్‌ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్‌ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. లివర్, కిడ్నీ మాత్రమే కాక కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తం చికెన్‌ వల్ల శక్తి పుంజుకుంటుంది.

పిల్లలు దోసెలని ఇష్టంగానే తింటారు. వీటిని బ్రేక్‌ ఫాస్ట్‌లా పెట్టవచ్చు లేదా స్నాక్‌గా కూడా తినిపించవచ్చు. దోసెలలో ఉండే ఇన్‌గ్రీడియెంట్స్‌ను హై క్యాలరీ ఫుడ్స్‌ గా చెప్పవచ్చు. బీన్స్‌లో ఉండే సాల్యుబుల్‌ ఫైబర్‌ బ్లడ్‌ షుగర్‌ ని క్రమబద్ధీకరించి, మూడ్‌ స్వింగ్స్‌ లేకుండా చేస్తుంది కాబట్టి పిల్లలకి వారికి నచ్చిన పద్ధతిలో బీన్స్‌ వండి పెట్టడం ఎంతో మేలు. చిలగడదుంపలో ఫైబర్, విటమిన్స్‌ బి,సి ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి మినరల్స్‌ ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బీటా కెరొటిన్‌ చేసుకోవడానికి హెల్ప్‌ చేస్తుంది. మనకి సంవత్సరం పొడుగూతా దొరికే అరటి పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరుగుదల సరిగ్గా జరిగేలా చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ బీ 6 వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి పిల్లలకు అరటి పండు కూడా ఒక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్‌ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఆప్రికాట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ని ఇష్టపడని పిల్లలు అరుదుగానే ఉంటారు. నేరుగా తీసుకుంటే అలాగే పెట్టవచ్చు. లేదంటే వీటిని స్నాక్స్‌లాగా యూజ్‌ చేసుకోవచ్చు. లేదా ఐస్‌క్రీమ్స్, స్మూతీల్లో కలపవచ్చు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి అవసరమైన ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్‌ వంటివన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో ఉన్నాయి.

పండ్లు ఎవరికైనా ఎంతో మంచివి, ఎదిగే వయసులో ఉన్న పిల్లలు వీటిని తినటం ఎంతో మంచిది. కానీ, కొందరు పిల్లలకి పండ్లు నచ్చవు, ముఖం తిప్పుకుంటారు. అలాంటప్పుడు వీటిని స్మూతీలా చేసి ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యంగా బరువు పెరగడానికి సాయం చేసే వాటిలో తేనె కూడా ఒకటి. అవకాడోలో విటమిన్స్‌ సీ, ఈ, కే, బీ6, పొటాషియం, ఫ్యాట్, ఫైబర్, లుటీన్, బీటా కెరొటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండడం వలన ఓవరాల్‌ హెల్త్‌ బాగుండడానికి అవకాడో ఎంతో సాయం చేస్తుంది. మొక్కజొన్నలో ఉండే కెరొటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతే కాక, మొక్కజొన్న లో పిండిపదార్థాలు కూడా ఎక్కువే. మొక్కజొన్న కండె ఉడికించి పిల్లలకి పెట్టవచ్చు.

జంక్‌ఫుడ్, ఫ్యాట్, షుగర్‌ ఎక్కువ ఉన్న ఆహారం వల్ల పిల్లలు కొంత బరువు పెరుగుతారేమో కానీ దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ జంక్‌ ఫుడ్స్‌ పిల్లలకి కావాల్సిన పోషకాలని అందించలేవు. అందువల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు తోడ్పడే ఆహారాన్ని పెట్టాలి. అలాంటి వాటిలో పాలు ముఖ్యమైనవి. పిల్లలందరి శరీర తత్త్వం ఒకేలా ఉండదు. బరువు తక్కువ ఉన్న పిల్లలకి పెట్టడానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్‌ ఉన్న ఫుడ్స్‌ ఎంచుకోవడం వల్ల త్వరగా బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది.