భర్త బిజినెస్‌‌లో కాజల్.. ‘ఎఫ్ 3’ సెట్స్‌లో వెంకీ.. దిల్ రాజు ఒకేరోజు ఐదు సినిమాలు..

భర్త బిజినెస్‌‌లో కాజల్.. ‘ఎఫ్ 3’ సెట్స్‌లో వెంకీ.. దిల్ రాజు ఒకేరోజు ఐదు సినిమాలు..

Kajal Aggarwal: భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ ఇంటీరియర్ బిజినెస్‌ను ప్రారంభించింది. దీనికి ‘కిచ్డ్’ అనే పేరు కూడా పెట్టేసింది. ఇంటీరియర్ డిజైనింగ్‌కి సంబంధించిన అన్నింటినీ వీరి బ్రాండ్ అందిస్తుంది. భర్తతో కలిసి తను ప్రారంభించిన మొట్టమొదటి వెంచర్ ఇదని కాజల్ వెల్లడించింది. ఇంతకంటే ముందు కాజల్ సినిమా నిర్మాణం చేపట్టాలని అనుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె ఆలోచనలన్నీ మారిపోయాయి. భర్తకు అనుభవం ఉన్న వ్యాపార రంగంపైనే దృష్టి సారించాలని ఫిక్స్ అయింది..

Kajal - Gautam
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’.. గతేడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇప్పుడు మోర్‌ఫన్‌తో.. అదే టీమ్‌తో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్‌3’ రూపొందనుంది. బుధవారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది..

F 3
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ చేసి టాలీవుడ్ కింగ్ మేకర్‌గా ఎదిగారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడమే కాక ఎందరో దర్శకులను పరిచయం చేశారాయన. ఇటీవలే 50వ పడిలోకి అడుగుపెట్టిన రాజు మరో అరుదైన ఘనత సాధించారు. అదేంటంటే ఒకే రోజు ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ఐదు సినిమాల షూటింగ్స్ ప్రారంభమయ్యాయి.. ‘వకీల్ సాబ్’, ‘ఎఫ్ 3’, ‘థ్యాంక్యూ’, ‘పాగల్’ చిత్రాలతో పాటు ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడం విశేషం..

Thank You