WhatsApp Accounts Ban : భారత్‌లో ఒక్క నెలలోనే 23 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?
WhatsApp Accounts Ban : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షలాది భారతీయ అకౌంట్లను నిషేదించింది. 2022 అక్టోబర్‌లో దాదాపు 23 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది.

WhatsApp Accounts Ban : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షలాది భారతీయ అకౌంట్లను నిషేదించింది. 2022 అక్టోబర్‌లో దాదాపు 23 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D) ప్రకారం.. యూజర్ల భద్రతా మార్గదర్శకాలను అనుసరించి అక్టోబర్ నెలలో 23 లక్షల భారతీయ WhatsApp అకౌంట్లను బ్యాన్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్ల భద్రతకు సంబంధించి నిషేధించిన అకౌంట్ల జాబితాను రిలీజ్ చేసింది. నెలవారీ నివేదిక, అక్టోబర్ 1- అక్టోబర్ 31, 2022 మధ్య యూజర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత (2,324,000) వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్టు వెల్లడించింది. ఆ 23 లక్షల అకౌంట్లలో వాట్సాప్ యూజర్ల ఫిర్యాదులను స్వీకరించేందుకు ముందే 811,000 భారతీయ అకౌంట్లను నిషేధించింది.
ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విధానాలు, నియమాలకు అనుగుణంగా లేని కారణంగా వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్టు తెలిపింది. వాట్సాప్ ఫిర్యాదు మెకానిజమ్‌ల ద్వారా భారతీయ యూజర్ల నుంచి ఫిర్యాదుల నివేదికలను స్వీకరించడాన్ని నిషేధించినట్లు వాట్సాప్ నివేదికలో పేర్కొంది. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌కు నెలలో 701 ఫిర్యాదుల నివేదికలు అందాయి. దాంతో 34 అకౌంట్లపై చర్యలు చేపట్టింది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ఎల్లప్పుడూ యూజర్లకు సురక్షితమైన వేదికను అందించినట్టు నివేదిక పేర్కొంది.
వాట్సాప్‌లో డేటా దుర్వినియోగాన్ని నిరోధించేందుకు నియమాలు, మార్గదర్శకాలను నిర్దేశించింది. వినియోగదారుల భద్రతతో పాటు ప్రైవసీ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసులను అందిస్తోంది. వాట్సాప్ IT రూల్స్ 2021 ప్రకారం.. వాట్సాప్ ఏళ్ల తరబడి తమ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టులు, నిపుణులతో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటోంది.
వాట్సాప్ అకౌంట్ ఎందుకు నిషేధించిందంటే? :
వాట్సాప్ యూజర్లు (Whatsapp Users) SPAM మెసేజ్‌లపై ఎక్కువమొత్తంలో ఫిర్యాదులను స్వీకరించినట్లయితే లేదా ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్దేశించిన షరతులను యూజర్ ఉల్లంఘిస్తున్నట్లు తేలితే వారిని వెంటనే నిషేధిస్తుంది. గుర్తు తెలియని కాంటాక్టులను ఇతర యూజర్లు బ్లాక్ చేయరాదు లేదా రిపోర్ట్ చేయరాదని భావిస్తే.. స్పామ్ చేయడం లేదా మెసేజ్ పంపడం మానుకోవాలని ప్లాట్‌ఫారమ్ అందరికీ సూచిస్తోంది.

WhatsApp banned over 23 lakh Indian accounts in October 2022 for violating its safety rules
WhatsApp అకౌంట్లను ఎలా నిషేధిస్తుంది :
వాట్సాప్ స్పామ్ (SPAM) లేదా మోసపూరిత యూజర్లను ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ అకౌంట్ దుర్వినియోగంపై మూడు దశల్లో పనిచేస్తుంది. వాట్సాప్ రిజిస్ట్రేషన్ సమయంలో మెసేజ్ పంపే సమయంలో నెగిటివ్ అభిప్రాయానికి రెస్పాన్స్ అందిస్తుంది. అప్పుడు WhatsApp యూజర్ ఫిర్యాదులు, నివేదికలను బ్లాక్‌ల రూపంలో స్వీకరిస్తుంది. ఆపై ఎడ్జ్ కేసులను అంచనా వేసేందుకు కాలక్రమేణా మెరుగుపర్చేందుకు విశ్లేషకుల బృందం ఈ సిస్టమ్‌లను అందిస్తోంది.
WhatsApp అకౌంట్లను ఎలా Report చేయాలి?
మీరు “wa@support.whatsapp.com”కు మెయిల్ ద్వారా హానికరమైన అకౌంట్ల గురించి WhatsApp సపోర్టుకు మీ ఫిర్యాదును పంపవచ్చు. అకౌంటుతో వారికి ఉన్న సమస్యలను నివేదించవచ్చు. యూజర్లకు నివేదించడానికి మీ కారణానికి రుజువుగా మీరు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయాలి. మీరు WhatsApp Chat > మరిన్ని ఆప్షన్లను నొక్కండి > More > నివేదించడం ద్వారా కూడా మీరు WhatsApp అకౌంట్ నివేదించవచ్చు. మీరు వినియోగదారుని నివేదించడం లేదా వారి అకౌంట్ బ్లాక్ చేయడం మధ్య ఎంచుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..