వాట్సప్ గ్రూప్ చాట్‌లలో కొత్త ఫీచర్.. ఇక ఎప్పటికీ వినిపించవ్..

వాట్సప్ గ్రూప్ చాట్‌లలో కొత్త ఫీచర్.. ఇక ఎప్పటికీ వినిపించవ్..

WhatsApp security feature

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్.. ప్రైవసీకి సంబంధించి యూజర్లలో పలు సందేహాలు రగులుతూ ఉన్నా.. అప్ డేట్స్ ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఇప్పుడు రీసెంట్ గా మరో ఫీచర్ ను యాడ్ చేసింది. గతంలో వాట్సప్ గ్రూప్ చాట్ లకు ఉండే మ్యూట్ ఆప్షన్ కు అడిషనల్ గా మరో ఫీచర్ యాడ్ అయింది. ఇంతకుముందు మ్యూట్ ఆప్షన్ 8గంటల నుంచి సంవత్సరం వరకూ ఉండేది దానిని ఎప్పుడూ మ్యూట్ లో ఉండేలా సెట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ విషయాన్ని వాట్సప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సంవత్సరానికి బదులుగా.. ఎప్పటికి ఉండేలా చేశాం. ఫీచర్ బెనిఫిట్ ను ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం. అని ట్వీట్ చేసింది.


ఈ మోడ్ ఆన్ చేయడానికి చేయాల్సిందల్లా.. గ్రూప్ మీద ట్యాప్ చేయడం, మ్యూట్ నోటిఫికేషన్స్ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవడం, అక్కడ ఎప్పుడూ అనేది ప్రెస్ చేయడం. అంతే.

ఒకవేళ దానిని మ్యూట్ లో నుంచి తీసేయాలన్నా.. సేమ్ ప్రోసెస్. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేటెస్ట్ వెర్షన్ లలోనే అందుబాటులో ఉంది. ఒకవేళ అది మీకు కనిపించకపోతే గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ లో అప్ డేట్స్ కోసం చెక్ చేసుకోండి. కొద్ది నెలల క్రితం యాడ్ చేసిన సెర్చింగ్ ఆప్షన్ యూజర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఈ క్రమంలోనే వాట్సప్ లో రాబోయే ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉండనుంది. మనకు నచ్చని చాటింగ్ మెసేజ్ లను డిలీట్ చేయడానికి బదులుగా హైడ్ లో పెట్టేసుకోవచ్చు. లేదంటే చాట్ చేసి ఆరు నెలలు దాటిపోతే అవి ఆటోమేటిక్ గా హైడ్ లోకి వెళ్లిపోతాయి. కావాలనుకుంటే వాటిని చూడొచ్చు. ఈ ఫీచర్ ను ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ లో చెకింగ్ లో ఉంది.