WhatsApp for Desktop : వాట్సాప్ డెస్క్‌‌టాప్‌లో సెక్యూరిటీ ఫీచర్.. మీ యాప్ అకౌంట్‌ హ్యాక్ చేయలేరు..!

WhatsApp for Desktop : ప్రముఖ వాట్సాప్ (Whatsapp) యాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్లో సెక్యూరిటీ ఫీచర్ రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ అకౌంట్ డేటాను భద్రపరుచుకుపోవచ్చు. వాట్సాప్‌లో Android, iOS యూజర్ల కోసం అదనపు భద్రతను అందించేందుకు లాక్ ఫీచర్‌ను అందిస్తుంది.

WhatsApp for Desktop : వాట్సాప్ డెస్క్‌‌టాప్‌లో సెక్యూరిటీ ఫీచర్.. మీ యాప్ అకౌంట్‌ హ్యాక్ చేయలేరు..!

WhatsApp for desktop to become more secure with this new feature, here is how it works

WhatsApp for Desktop : ప్రముఖ వాట్సాప్ (Whatsapp) యాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్లో సెక్యూరిటీ ఫీచర్ రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ అకౌంట్ డేటాను భద్రపరుచుకుపోవచ్చు. వాట్సాప్‌లో Android, iOS యూజర్ల కోసం అదనపు భద్రతను అందించేందుకు లాక్ ఫీచర్‌ను అందిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ Android స్మార్ట్‌ఫోన్‌లలో లేదా iPhoneలో టచ్ ID లేదా Face IDతో వారి ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించి యాప్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని యాప్ ఈ సెక్యూరిటీ ఫీచర్‌ని వాట్సాప్ డెస్క్‌టాప్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌కు పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం ద్వారా యూజర్లు తమ అకౌంట్ హ్యాక్ కాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వాట్సాప్ కొత్త ఫీచర్‌పై మెసేజింగ్ ప్లాట్‌ఫాం పనిచేస్తోందని WABetaInfo నివేదిక వెల్లడించింది. చాట్‌లకు అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడానికి PC లేదా ల్యాప్‌టాప్‌ని గమనించకుండా వదిలేస్తే డెస్క్‌టాప్ కోసం స్క్రీన్ లాక్ యాప్‌కి అదనపు భద్రతను అందిస్తుంది. WhatsApp డెస్క్‌టాప్ కోసం స్క్రీన్ లాక్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది.

త్వరలో కొన్ని బీటా టెస్టర్‌లకు కూడా ఈ వాట్సాప్ డెస్క్ టాప్ ఫీచర్ లాంచ్ కానుంది. ముఖ్యంగా, వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS వెర్షన్‌ల మాదిరిగానే డెస్క్‌టాప్ యూజర్ల కోసం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను ఐచ్ఛికంగా ఉంచుతుంది. మెసేజింగ్ యాప్ ఎవరైనా తమ స్క్రీన్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే దానిని మార్చుకోవడానికి లేదా రీసెట్ చేయడానికి దాని యూజర్లను అనుమతిస్తుంది. పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసేందుకు WhatsApp డెస్క్‌టాప్ యాప్ నుంచి లాగ్ అవుట్ చేసి, మీ డివైజ్ QR కోడ్‌తో లింక్ చేయడం ద్వారా మళ్లీ లాగిన్ అవ్వాలి.

WhatsApp for desktop to become more secure with this new feature, here is how it works

WhatsApp for desktop to become more secure with this new feature, here is how it works

ఆండ్రాయిడ్ బీటాలో వాట్సాప్ Companion mode :
WhatsApp కొన్ని Android బీటా టెస్టర్‌లకు కంపానియన్ మోడ్‌ను ఫీచర్ రిలీజ్ చేసింది. కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ 2.22.24.18 కోసం WhatsApp బీటాతో లాంచ్ అయింది. యూజర్లు వారి ప్రస్తుత WhatsApp అకౌంట్ మరొక Android స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌కి లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లను ఒకేసారి నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇతర ఫీచర్‌ని ఉపయోగించేందుకు WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి, ‘Linked Devices’పై నొక్కండి. మీ WhatsApp అకౌంట్‌కు సెకండరీ డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు ఆటోమాటిక్‌గా ఆటోమాటిక్‌గా రూపొందించిన QR కోడ్‌ని పొందవచ్చు.

WhatsApp డెస్క్‌టాప్ మాదిరిగానే, యాప్ లింక్ చేసిన సెకండరీ డివైజ్‌లో కూడా చాట్ హిస్టరీ, ఇతర డేటాను సింక్ చేస్తుంది. కంపానియన్ మోడ్ ప్రస్తుతం బీటాలో ఉందని, లైవ్ లొకేషన్, broadcast లిస్టులను నిర్వహించడం వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉండవని గమనించాలి. వాట్సాప్ భవిష్యత్ అప్‌డేట్‌లతో త్వరలో అందరి కోసం ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Businesses : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ దగ్గరలోని బిజినెస్ లొకేషన్ ద్వారా షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!