WhatsApp in-chat Polls : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఇకపై పోల్ ఫీచర్ అందరూ క్రియేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp in-chat Polls : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) ఇటీవలే క్రియేట్ పోల్ ఫీచర్‌ (WhatsApp in-chat Polls)ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iPhone యూజర్లందరికి అందుబాటులోకి వచ్చేసింది.

WhatsApp in-chat Polls : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఇకపై పోల్ ఫీచర్ అందరూ క్రియేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp in-chat Polls feature _ Here’s how to use it

WhatsApp in-chat Polls : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) ఇటీవలే క్రియేట్ పోల్ ఫీచర్‌ (WhatsApp in-chat Polls)ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iPhone యూజర్లందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకుముందు.. ఈ ఫీచర్ కేవలం గ్రూప్‌లలో మాత్రమే పోల్‌లను క్రియేట్ చేసేందుకు యూజర్లను అనుమతించింది. అయితే ఇప్పుడు వాట్సాప్ యూజర్లు దీన్ని పర్సనల్ చాట్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.. ఈ కింది విధంగా ఫాలో అయితే చాలు..

Androidలో పోల్‌లను ఎలా క్రియేట్ చేయాలంటే? :

* Android హ్యాండ్‌సెట్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
* మీరు పోల్‌ని క్రియేట్ చేయాలనుకునే గ్రూపు లేదా చాట్‌ని విజిట్ చేయండి.
* టైపింగ్ బాక్స్‌లో ఉన్న అటాచ్ బటన్‌పై Click చేయండి.
* పోల్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* మీరు ఏ ప్రశ్నలను, అవసరమైన ఆప్షన్లను ఎంటర్ చేయండి.
* Send బటన్‌ను Tap చేయండి.
* గ్రూప్ సభ్యులు కేవలం View Votes బటన్‌పై Tap చేయడం ద్వారా మొత్తం ఓట్లను చూడవచ్చు.

WhatsApp in-chat Polls feature _ Here’s how to use it

WhatsApp in-chat Polls feature _ Here’s how to use it

ఐఫోన్ iOSలో పోల్‌లను ఎలా క్రియేట్ చేయాలంటే? :

* ఆపిల్ ఐఫోన్ iOS డివైజ్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
* మీరు పోల్‌ను క్రియేట్ చేసే చాట్ లేదా గ్రూపు చాట్ కు వెళ్లండి.
* టైయింగ్ బాక్స్ కుడి వైపున ఉన్న + ఐకాన్‌పై క్లిక్ చేయండి.
* పోల్ ఎంపికను ఎంచుకోండి.
* పోల్ కోసం అవసరమైన ప్రశ్నలు, ఆప్షన్లను పూరించండి.
* Send బటన్‌ను Tap చేయండి.
* done.. పోల్ క్రియేట్ అయినట్టే..

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 10 Pro : భారీగా తగ్గిన వన్‌ప్లస్ 10ప్రో స్మార్ట్‌ఫోన్ ధర.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!