WhatsApp New Updates : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్స్.. ఇకపై యూజర్లు కాల్స్ చేసుకోవడం చాలా ఈజీ తెలుసా?

WhatsApp New Updates : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రస్తుతం యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ల ప్రైవసీతో పాటు సెక్యూరిటీని యాడ్ చేసేందుకు కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది.

WhatsApp New Updates : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రస్తుతం యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ల ప్రైవసీతో పాటు సెక్యూరిటీని యాడ్ చేసేందుకు కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ఐఫోన్ (iOS)లో కొత్త ఎడిటింగ్ ఫీచర్ల నుంచి లాంగ్ గ్రూప్ పేర్ల వరకు యాప్ భవిష్యత్తులో అనేక ఫీచర్లను రిలీజ్ చేయనుంది. రాబోయే ఫీచర్ల జాబితాలో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు కాలింగ్ షార్ట్‌కట్‌లను క్రియేట్ చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపింది.

WAbetainfo నివేదిక ప్రకారం.. WhatsApp కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్‌ను యాడ్ చేయాలని యోచిస్తోందని పేర్కొంది. తద్వారా కాల్‌లను వేగంగా డయల్ చేసేందుకు యూజర్లకు అనుమతినిస్తుంది. అంతేకాదు.. త్వరగా కాలింగ్ షార్ట్‌కట్‌లను క్రియేట్ చేసుకోవాడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ ప్రస్తుతం మెసేజింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్‌లను అందిస్తోంది. యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు బిజినెస్ చాటింగ్‌లను కూడా చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, మెసేజింగ్ కాకుండా, వాట్సాప్ కాల్‌ని డయల్ చేసే ప్రక్రియ కొన్ని సెకన్ల సమయం పడుతుంది. నివేదికల ప్రకారం, వాట్సాప్ యూజర్ల కోసం కాలింగ్ షార్ట్‌కట్‌లను క్రియేట్ చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వనుంది.

Read Also : WhatsApp Messages : ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మీ వాట్సాప్ మెసేజ్‌లను రీసెట్ చేయకుండానే ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?

Whatsapp కాలింగ్ షార్ట్‌కట్ ఎలా క్రియేట్ చేయాలంటే? :
నివేదిక ప్రకారం.. కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ ( Calling Shortcut) ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. భవిష్యత్తులో యాప్‌ల అప్‌డేట్‌లలో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేయనుందని భావిస్తున్నారు. కాంటాక్ట్‌ల లిస్టులోని కాంటాక్ట్ సెల్‌ను Tap చేయడం ద్వారా వినియోగదారులు WhatsApp కాలింగ్ షార్ట్‌కట్ క్రియేట్ చేయగలరు. WhatsApp షార్ట్‌కట్ క్రియేట్ చేయాలంటే.. మీ డివైజ్ హోమ్ స్క్రీన్‌కు ఆటోమాటిక్‌గా యాడ్ అవుతుంది. ఈ ఫీచర్ యూజర్లను కాల్ చేసేందుకు కాంటాక్ట్ కోసం సెర్చ్ చేయడంలో కొంత సమయాన్ని ఆదా చేసేందుకు సాయపడుతుంది.

WhatsApp New Updates : WhatsApp making it easier for users to make calls

కాల్ ఫాదర్‌కు డయల్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ కాల్‌లో తరచుగా కనెక్ట్ అయ్యే వారిని కాంటాక్ట్ అయ్యేందుకు వీలుంది. ముఖ్యంగా, వాట్సాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్ల కాంటాక్ట్ షార్ట్‌కట్‌లను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. నిర్దిష్ట చాట్ విండోకు వేగంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాలింగ్ షార్ట్‌కట్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంది. కానీ, ఈసారి కాల్ ద్వారా యూజర్లు ఈజీగా తమ స్నేహితులతో కనెక్ట్ కావొచ్చు. సహాయం చేస్తుంది. WhatsApp యూజర్ల కోసం ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను పంపేందుకు అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా మెసేజింగ్ యాప్ పని చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, ప్లాట్‌ఫారమ్ ఫొటోల క్వాలిటీని కంప్రెస్ చేస్తుంది. తద్వారా ఫొటోల క్వాలిటీ తగ్గిపోతుంది. కానీ, త్వరలో ప్లాట్‌ఫారమ్ కొత్త ఐకాన్ యాడ్ చేయాలని భావిస్తోంది.

దీని ద్వారా యూజర్లు ఏదైనా ఫొటోను పంపే ముందు దాని క్వాలిటీని ఎంచుకోవచ్చు. అదేవిధంగా, డ్రాయింగ్ టూల్‌కు కొత్త టెక్స్ట్ ఎడిటర్‌ను కూడా యాడ్ చేయనుంది. వినియోగదారులు తమ టెక్స్ట్ పంపే ముందు కస్టమైజ్ చేసుకోవచ్చు. విభిన్న ఫాంట్‌లతో త్వరగా ​​టెక్స్ట్ అలైన్‌మెంట్ (ఎడమ, మధ్య, కుడి) మార్చుకోవచ్చు. టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను కూడా మార్చుకోవచ్చు. ఈ మూడు కొత్త ఫీచర్లపై WhatsApp డ్రాయింగ్ టూల్‌లో యాడ్ చేయనుంది. అదనంగా, WhatsApp మెసేజింగ్ కొత్త ఫాంట్‌లను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అయితే, వాట్సాప్ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉన్నాయని, భవిష్యత్తులో కొత్త అప్‌డేట్‌లతో అందుబాటులోకి రావొచ్చునని భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5 Best Cars Audio Systems : 2023లో కొత్త కారు కొంటున్నారా? ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో వచ్చిన 5 బెస్ట్ కార్లు ఇవే.. మీకు నచ్చిన కారు కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు