Whats App : వాట్సప్ కొత్త ఫీచర్…వ్యూ వన్స్

మామూలుగా వాట్సప్ లో ఓ యూజర్ వీడియో, ఫోటోలను పంపితే రెసిపెంట్ యూజర్ వాటిని చూడవచ్చు.

Whats App : వాట్సప్ కొత్త ఫీచర్…వ్యూ వన్స్

Whatsapp

Whats App : రోజుకో కొత్త ఫీచర్ తో వాట్సప్ యూజర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యూ వన్స్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫీచర్ లో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెస్సేజ్ లను రెసిపెంట్ యూజర్ చూడకుండా నియంత్రించే అవకాశం ఇందులో ఉంది.

మామూలుగా వాట్సప్ లో ఓ యూజర్ వీడియో, ఫోటోలను పంపితే రెసిపెంట్ యూజర్ వాటిని చూడవచ్చు. వీడియోలు, ఫోటోలను ఒక్కసారిి రెసిపెంట్ యూజర్ డౌన్ లోడ్ చేసుకుంటే పర్మినెంట్ గా ఫోన్ వాట్సప్ గ్యాలరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. వాటిని మనం డిలేట్ చేస్తే తప్ప శాశ్వితంగా ఉండిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వాటిని చూసుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచరతో ఆ అవకాశం ఉండదు. రెసిపెంట్ యూజర్ ఒక్కసారి మాత్రమే పంపిన మెసేజ్ లను చూడగలుగుతాడు.

దీనితోపాటు వ్యూ వన్స్ ఫీచర్ లో వాట్సప్ యాప్ లో ఫోటో, వీడియో పంపే సమయంలో యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా 1 చిహ్నంపై ట్యాప్ చేయాలి. దీని వల్ల యూజర్ పంపిన వీడియో, ఫోటోలను రెసిపెంట్ యూజర్ అనగా ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారు ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు. రెసిపెంట్ యూజర్ మేసేజ్ ఓపెన్ చేశాక ఆసందేశం చూసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆతరువాత దానికి సంబంధించిన సమాచారం గ్యాలరీలో సేవ్ కాదు.

14రోజుల పాటు పంపిన పోటో, వీడియోలను రెసిపెంట్ యూజర్ చూడని పక్షంలో వాటంతట అవే కనిపించకుండా పోతాయి. వ్యూ వన్ ఫీచర్ తో పంపిన మేసేజ్ లను ఇతరులకు ఫార్వర్డ్ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే స్కీన్ షాట్ తీస్తే మాత్రం రెసిపెంట్ యూజర్ వాటిని గ్యాలరీలో భద్రపరుచుకోవచ్చు. రెసిపెంట్ స్కీన్ షాట్ తీస్తే యూజర్ కు ఏమాత్రం తెలియదు.

ప్రస్తుతం ఈ అప్ డేట్ ఫీచర్ భారత్ లోని వాట్సప్ యాప్ కలిగిన ఐఫోన్ యూజర్లతోపాటు, అండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.