WhatsApp: వాట్సప్‌లో కొత్తగా మూడు ఫీచర్స్

నిత్యం ఏదో ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్న పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో ఉత్తమ ఫీచర్‌తో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించింది.

WhatsApp: వాట్సప్‌లో కొత్తగా మూడు ఫీచర్స్

Whatsap

WhatsApp in four devices: నిత్యం ఏదో ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్న పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో ఉత్తమ ఫీచర్‌తో ముందుకు వస్తుంది. మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ పేరుతో వస్తున్న ఈ ఫీచర్‌లో, యూజర్లు ఒకేసారి నాలుగు పరికరాల్లో ఒక వాట్సాప్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ గురించిన సమాచారాన్ని ఇచ్చే వెబ్‌సైట్ WABetaInfo ఈ సమాచారాన్ని ఇచ్చింది.

మొత్తం మూడు కొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం వాట్సప్ తీసుకుని వస్తుంది. కంపెనీ త్వరలో వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ ఫీచర్‌ను ప్రారంభించనుండగా.. దీంతో నాలుగు డివైజెస్‌లో వాట్సప్ ఉపయోగించుకునే వీలును కల్పిస్తున్నారు. ఈ ఫీచర్‌కి ముందు, వినియోగదారులు ఒకే పరికరంలో మాత్రమే ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించుకునే వీలు ఉండేది. వాట్సాప్ అకౌంట్.. ఒక పరికరంలో లాగిన్ అయి ఉంటే.. మీరు వేరే పరికరంలో వాట్సాప్ అకౌంట్‌ను లాగిన్ చేస్తే, మొదటి పరికరంలో వాట్సాప్ అకౌంట్ లాగ్-అవుట్ అవుతుంది. ఈ క్రొత్త ఫీచర్ వచ్చిన తరువాత, వినియోగదారులకు ఇటువంటి సమస్య తొలగిపోతుంది.

మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ వచ్చిన తర్వాత.. OTPతో ధృవీకరణ తరువాత, వినియోగదారులు ఒకే వాట్సాప్ ఖాతాను గరిష్టంగా నాలుగు పరికరాల్లో వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌తో పాటు మరో రెండు ఫీచర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.. అందులో ఒకటి డిసప్పియరింగ్ మెసేజెస్, రెండు వ్యూ వన్స్.

వాట్సప్ గతేడాది డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను అందుబాటులో తెచ్చింది.. అయితే, గ్రూప్స్‌లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది ఇప్పటివరకు. ఈ ఫీచర్‌తో చాట్‌లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను అన్ని చాట్‌లకు ఆన్ చేసేలా ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది వాట్సప్.

దీంతో పాటు వ్యూ వన్స్ అనే ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మీరు ఎవరికైనా ఏదైనా మెసేజ్, ఫోటో, వీడియో పంపితే.. వాళ్లు ఒక్కసారే చూడొచ్చు. ఒకసారి చూసిన తర్వాత ఆ మెసేజ్, ఫోటో, వీడియో డిలిట్ అయిపోతుంది. అయితే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.