WhatsApp Self-Chat : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. సెల్ఫ్-చాట్ ఆప్షన్ వచ్చేసింది.. ఇక మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..!

WhatsApp Self-Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. కొంతమంది వాట్సాప్ యూజర్లకు సెల్ఫ్ చాట్ ఆప్షన్ వచ్చేసింది. రాబోయే కొన్ని ఫీచర్లలో వాట్సాప్ బీటా టెస్టింగ్‌ను లాంచ్ చేసింది. ఆటో మ్యూట్ లార్జ్ గ్రూప్ చాట్‌లలో మీకే మీరే మెసేజ్ పంపుకోవచ్చు.

WhatsApp Self-Chat : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. సెల్ఫ్-చాట్ ఆప్షన్ వచ్చేసింది.. ఇక మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..!

WhatsApp self-chat option now available for some users, 3 other features coming soon

WhatsApp Self-Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. కొంతమంది వాట్సాప్ యూజర్లకు సెల్ఫ్ చాట్ ఆప్షన్ వచ్చేసింది. రాబోయే కొన్ని ఫీచర్లలో వాట్సాప్ బీటా టెస్టింగ్‌ను లాంచ్ చేసింది. ఆటో మ్యూట్ లార్జ్ గ్రూప్ చాట్‌లలో మీకే మీరే మెసేజ్ పంపుకోవచ్చు. ఎంట్రీ పాయింట్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రీడిజైన్ డిజప్పయర్ మెసేజ్ విభాగంలో ఉంది. మెటా యాజమాన్యంలోని యాప్ రిచ్ లింక్ ప్రివ్యూను కూడా రిలీజ్ చేస్తోంది. Android, iOSతో సహా యూజర్లందరి కోసం టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్స్ పొందవచ్చు. రాబోయే వాట్సాప్ ఫీచర్ల గురించి మాట్లాడుతూ.. ప్లాట్‌ఫారమ్ బీటా యూజర్ల కోసం అధికారికంగా ఫీచర్లను లాంచ్ చేస్తోంది. వాట్సాప్ అప్‌డేట్ అందరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని WaBetaInfo నివేదించింది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. Android, iOS యూజర్ల కోసం రాబోయే అన్ని ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం.

Send message to yourself :
ఆండ్రాయిడ్ బీటా కోసం ఆండ్రాయిడ్ కోసం ‘Send message to yourself’ ఫీచర్‌ను WhatsApp ఎట్టకేలకు లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సొంత ఫోన్ నంబర్‌తో చాట్ బాక్స్‌ను ఓపెన్ చేయవచ్చు. తద్వారా వారితో చాట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకరు త్వరగా నోట్స్ తీసుకోవచ్చు లేదా ముఖ్యమైన వెబ్ లింక్‌లు లేదా ఫైల్‌లను వారి సెల్ఫ్-చాట్ బాక్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. మీ సొంత నంబర్‌కు మెసేజ్ పంపడం ఎల్లప్పుడూ సాధ్యమే అయినప్పటికీ, కాంటాక్టు లిస్టులో స్పెషల్ సెల్ఫ్-చాట్ విండో లేదు.

WhatsApp self-chat option now available for some users, 3 other features coming soon

WhatsApp self-chat option now available for some users, 3 other features coming soon

యూజర్లు వారి ఫోన్ నంబర్‌ను కాంటాక్ట్‌లలో సేవ్ చేసి, ఆపై తమకు తామే మెసేజ్ పంపుకోవచ్చు. నోట్స్ తీసుకోవడానికి లేదా మీడియా ఫైల్‌లను పంపేందుకు సింగిల్ పార్టిసిపెంట్‌లతో గ్రూప్‌ను కూడా క్రియేట్ చేయవచ్చు. కానీ, కొత్త ఫీచర్‌తో వాట్సాప్ పర్సనల్ చాట్ బాక్స్ ‘Yourself (Me)’ని చాట్ క్యాప్షన్‌గా పంపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ సులభంగా యాక్సెస్ కోసం WhatsApp కాంటాక్ట్ లిస్ట్‌లో కనిపిస్తుంది. iOS బీటా యూజర్ల కోసం WhatsApp రాబోయే రోజుల్లో బీటా టెస్టర్ల కోసం సెల్ఫ్-చాట్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తుంది.

Auto mute large group chats :
మీరు గ్రూపుల నుంచి అన్ని బల్క్ మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో విసిగిపోయారా? ఈ రాబోయే ఫీచర్ మీ కోసమే అని చెప్పవచ్చు. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. నోటిఫికేషన్‌లను తగ్గించడంలో పెద్ద గ్రూప్ చాట్‌లను ఆటోమాటిక్‌గా మ్యూట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా టెస్టింగ్ కోసం ప్రస్తుతం అప్‌డేట్ అందుబాటులోకి వస్తోంది.

ఇంతకుముందు, వాట్సాప్ గ్రూప్ పార్టిసిపెంట్స్ లిమిట్ 1024కి అప్‌డేట్ చేసింది. ఇప్పుడు వాట్సాప్ 256 కన్నా ఎక్కువ మంది పాల్గొనే గ్రూపులను ఆటోమాటిక్‌గా మ్యూట్ చేస్తుంది. అయితే, యూజర్లు తమ ఇష్టానుసారం ఎప్పుడైనా నోటిఫికేషన్ సెట్టింగ్‌లను అన్‌మ్యూట్ చేయవచ్చు. ఎప్పుడైనా మార్చవచ్చు.

WhatsApp self-chat option now available for some users, 3 other features coming soon

WhatsApp self-chat option now available for some users, 3 other features coming soon

Redesigned disappearing messages section :
వాట్సాప్ కొత్త అప్‌డేట్‌తో ప్రైవసీ విభాగంలో అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్ సెట్టింగ్ కొత్త డిజైన్‌ను లాంచ్ చేస్తోంది. యూజర్లు WhatsApp Settings > Privacy> Default message timerకు వెళ్లడం ద్వారా అదృశ్యమవుతున్న మెసేజ్ సెట్టింగ్‌ను మార్చవచ్చు. కొత్త డిజైన్‌తో, వాట్సాప్ ‘default message timer section’ పేరును ‘disappearing messages’గా మార్చింది. వాట్సాప్ విభాగంలో రెండు సబ్ కేటగిరీలు కూడా ఉంటాయి, సెట్టింగ్‌లో ‘Set for your account, ‘Set for your current Chat’ ఆప్షన్లు ఉంటాయి. WhatsApp మెసేజ్ టైమర్ సెట్ చేసుకోవచ్చు.

Rich Link Preview Feature :
వాట్సాప్ యూజర్లు అందరికీ టెక్స్ట్ స్టేటస్ అప్‌డేట్స్ పొందవచ్చు. యూజర్ల కోసం రిచ్ లింక్ ప్రివ్యూలను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు యూజర్లు స్టేటస్ అప్‌డేట్స్ ద్వారా షేర్ చేసిన లింక్‌ల కోసం లింక్ ప్రివ్యూలను చూడవచ్చు. వాట్సాప్ నుంచి ఎదురుచూస్తున్న అప్‌డేట్ లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇప్పుడు Android, iOS రెండింటికీ అందుబాటులో ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్ అందుబాటులో లేకుంటే.. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. సరసమైన ధరకే రావొచ్చు!