WhatsApp webలో కొత్త ఫీచర్: మెసేంజర్ రూంలతో వీడియో కాల్స్

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 04:11 AM IST
WhatsApp webలో కొత్త ఫీచర్: మెసేంజర్ రూంలతో వీడియో కాల్స్

WABetaInfo ఇచ్చిన సమచారం మేరకు వాట్సప్ లోనూ మెసేంజర్ రూమ్స్ తీసుకురానున్నారు. జూమ్ లాంటి ఇతర వీడియో ప్లాట్ ఫాంలకు ధీటుగా ఫేస్‌బుక్ గత నెలలో వీడియో కాన్ఫిరెన్స్ టూల్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని వాట్సప్ వెబ్ వర్షన్ లోనూ చూడబోతున్నామని వెల్లడించింది ఫేస్‌బుక్. వాట్సప్ వెబ్ వర్షన్ 2.2019.6 ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. 

మెసేంజర్ రూంల ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వొచ్చని.. అది కూడా పీసీలు, ల్యాప్‌టాప్‌ల నుంచే కుదురుతుందని వెల్లడించింది. ఈ ఆప్షన్ అటాచ్ బటన్ పక్కనే ఇతర ఆప్షన్లతో పాటు కనిపిస్తుందని.. సమాచారం. ఈ న్యూ వర్షన్ యూజర్లందరికీ అందుబాటులో లేదు. డెవలప్‌మెంట్‌లోనే ఉండటంతో వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ అప్‌డేట్‌కు మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. 

రిపోర్టు మేరకు వాట్సప్ యూజర్లకు ఫీచర్ అప్‌డేట్స్ ద్వారా న్యూ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు. గతనెలలోనే ఫేస్‌బుక్ మెసేంజర్ రూమ్స్ అన్ని గ్రూప్ వీడియో కాల్స్ ను అనుమతిస్తుందని ఏ లిమిట్ లేకుండా ఒకేసారి 50మంది వీడియో కాల్ చేసుకోవచ్చని అన్నారు. 

యూజర్లు మెసేంజర్, ఫేస్‌బుక్ ద్వారా ఎవరినైనా వీడియోకాల్స్ కు ఆహ్వానించొచ్చని పైగా వారికి ఫేస్ బుక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఫేస్‌బుక్ మెసేంజర్ రూమ్స్‌లో యూజర్లు న్యూస్ ఫీడ్ లో లింకులు పోస్టు చేసుకోవచ్చు. గ్రూపులు, ఈవెంట్ పేజీలలోనూ ఇలా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

Read More :

ఈ టిప్స్ ఫాలో అవ్వండి : వాట్సాప్‌లో బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టాలంటే?

WhatsApp’s కొత్త ఫీచర్ : 8 మందితో Video Calls