4ఏళ్ల బాలుడి ప్రాణాలు నిలిపిన ‘Bone Marrow’ దాతను తొలిసారి కలిసిన వేళ..

  • Published By: srihari ,Published On : May 23, 2020 / 06:35 AM IST
4ఏళ్ల బాలుడి ప్రాణాలు నిలిపిన ‘Bone Marrow’ దాతను తొలిసారి కలిసిన వేళ..

విహాన్ అనే నాలుగేళ్ల బాలుడికి పుట్టకతోనే (జన్యు సంబంధత) వ్యాధి తలసేమియా వచ్చింది. ఆరు నెలల పసిప్రాయంలోనే విహాన్‌కు ఈ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న బాలుడికి ఎమక మజ్జ (Bone Marrow) ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైంది. అప్పుడే దేవుడిలా ముందుకొచ్చాడు కేరళకు చెందిన అనురూప్ అనే యువకుడు. విహాన్ ఫ్యామిలీకి అనురూప్ ఎలాంటి పరిచయం లేదు. అయినప్పటికీ తన ఎముక మజ్జను దానం చేసిన దాతగా బాలుడి తల్లిదండ్రుల్లో దేవుడిగా నిలిచాడు. అనురూప్ చేసిన సాయానికి అప్పటినుంచి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతభావంతో ఉన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన ఏడాది తర్వాత అనురూప్‌తో విహాన్ కుటుంబం తొలిసారి ముఖాముఖిగా కలిసింది. 

దాత అనురూప్ ను చూడగానే విహాన్ తల్లి భావోద్వేగానికి గురైంది. తన బిడ్డను కాపాడిన వ్యక్తిని చూడగానే ఆమెలో ఒక్కసారిగా దు:ఖం తన్నుకొచ్చింది. అనురూప్ ను చూడటం ఇదే మొదటిసారి కావడంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. పిల్లాడు విహాన్ సరదాగా ఆడుకోవడం కనిపించేసరికి అనురూప్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్‌డీటీవీ వీరిందరిని ఒకేచోట కలిసేలా ఏర్పాటు చేసింది. 
donor

ఈ సందర్భంగా దాత అనురూప్ మాట్లాడుతూ.. దాత్రి అనే నాన్ ఫ్రాఫిట్ ఏజెన్సీ నుంచి ఒక రోజు ఫోన్ కాల్ వచ్చింది. తలసేమియాతో బాధపడే నాలుగేళ్ల బాలుడికి బోన్ మ్యారో దానం చేసే దాత అవసరమని చెప్పడంతో తాను అంగీకరించినట్టు తెలిపాడు. బాలుడికి ఎముక మజ్జను దానం చేసే దాత కోసం దాత్రిలో డాక్టర్ సునీల్ భట్ రిజిస్టర్ చేశారు. విహాన్ ఎలా ఉన్నాడంటూ బాలుడి తల్లి భావనను అడగడంతో అతడు చాలా యాక్టివ్ గా ఉన్నాడని తెలిపింది. తన బిడ్డను కాపాడిన డాక్టర సునీల్, అనురూప్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 

Read: మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. పోలీసులకు స్వీట్లు పంచిన ఆర్మీ ఆఫీసర్