Cinemas Reopen: వెండితెర మీద బొమ్మపడేది ఎప్పుడంటే?

కరోనా మహమ్మారి పుణ్యమా అని రెండేళ్లలో ఓ ఏడాది మొత్తం థియేటర్లను మూతపెట్టారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుండగా వైరస్ వ్యాప్తి భయాలైతే ప్రజలను ఇంకా వీడలేదు.

Cinemas Reopen: వెండితెర మీద బొమ్మపడేది ఎప్పుడంటే?

Cinemas Reopen

Cinemas Reopen: కరోనా మహమ్మారి పుణ్యమా అని రెండేళ్లలో ఓ ఏడాది మొత్తం థియేటర్లను మూతపెట్టారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుండగా వైరస్ వ్యాప్తి భయాలైతే ప్రజలను ఇంకా వీడలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఇంకా థియేటర్లలో సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

కాగా, మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలో రెండు రకాల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తెలంగాణలో థియేటర్ల రీఓపెన్ చేసుకొనేందుకు అనుమతులిచ్చినా ఇప్పటికి ఇంకా కొత్త సినిమాల విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఇప్పటికీ లాక్ డౌన్ ఆంక్షల మధ్య కొనసాగుతూనే ఉంది.

దీంతో ఒక రాష్ట్ర ఆదాయాన్ని వదులుకొని సినిమాలను తెచ్చేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే.. ప్రస్తుతం ఏపీలో కూడా థియేటర్లను ప్రారంభించేలా చర్యలు ప్రారంభించినట్లు ఇండస్ట్రీ వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. జులై మూడవ వారంలో ఏపీలో కూడా థియేటర్లకు అనుమతులిచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు.

మరోవైపు అక్టోబర్ 30 వరకు విడుదలకాబోయే సినిమాలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఓటీటీలకు అమ్మవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తీర్మానం చేయగా ఈ మేరకు సెక్రటరీ సునీల్ నారంగ్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈనెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గట్టిగా వినిపిస్తుంది.