Tamil Nadu: ‘దిగువ కులం ఏది?.’అంటూ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్న..వివాదంలో వీసీ

యూనివర్శిటీ పరీక్షల్లో ‘లోయర్‌ క్యాస్ట్‌’ (దిగువ కులం లేదా అట్టడుగు కులం’) ఏది? అంటూ ఎగ్జామ్‌లో క్వశ్చన్‌ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కింద నాలుగు కులాల ఆప్షన్స్‌ కూడా ఇచ్చారు.

Tamil Nadu: ‘దిగువ కులం ఏది?.’అంటూ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్న..వివాదంలో వీసీ
ad

Periyar University Exam Triggers Row: తమిళనాడు సేలంలోని పెరియార్ యూనివర్శిటీ పరీక్షలు వివాదానికి దారి తీశాయి. పరీక్షల్లో కులాల ప్రస్తావనకు సంబంధించి ప్రశ్న ఉండేసరికి అదికాస్తా సంచలనంగా మారింది. పెరియార్ యూనివర్శిటీ పరీక్షల్లో ‘లోయర్‌ క్యాస్ట్‌’ (దిగువ కులం లేదా అట్టడుగు కులం ) ఏదీ? అంటూ ఎగ్జామ్‌లో క్వశ్చన్‌ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కింద నాలుగు కులాల ఆప్షన్స్‌ ఇచ్చారు. ఈ ఆప్షన్స్‌లో ఏది సరైందో గుర్తించి జవాబు రాయాలని పేర్కొన్నారు.

ఫస్టియర్‌ రెండో సెమిస్టర్ మాస్టర్ ఇన్ హిస్టరీ విద్యార్థులకు ఈ ప్రశ్న అడిగారు. ప్రశ్నపత్రం వైరల్‌గా మారడంతో పెరియార్ యూనివర్సిటీ వైన్‌చాన్స్‌లర్‌ (వీసీ) జగన్నాథన్ స్పందించారు. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.“పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను పెరియార్ విశ్వవిద్యాలయం తయారు చేయదని స్పష్టం చేసిన ఆయన కులానికి సంబంధించిన ప్రశ్నను తాము ప్రిపేర్ చేయలేదని..మరో యూనివర్సిటీ సిద్ధం చేసిందని..ఇతర వర్శిటీలు..లెక్చరర్లు పేపర్లు ప్రిపేర్ చేస్తారని వైస్ ఛాన్సలర్ వివరణ ఇచ్చారు.

ఈ వివాదాస్పద ప్రశ్నపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు వీసీ. ప్రశ్న పత్రాన్ని సెట్ చేసిన సంబంధిత అధికారి నుంచి నివేదిక కోరామని తెలిపారు. తిరిగి పరీక్ష నిర్వహించే ఆలోచన లేదని వెల్లడించారు వీసీ. ఎగ్జామ్‌ పేపర్లలో వివాదాస్పద అంశాలకు చోటివ్వడం నిషేధం. నిపుణులు మాత్రమే పరీక్ష పేపర్‌ను తయారు చేస్తారు. పేపర్‌ తయారీ తర్వాత సమగ్ర పరిశీలన ఉంటుంది. ఇన్ని దశలు దాటిన తర్వాతే.. క్వశ్చన్‌ పేపర్‌ రూపుదిద్దుకుంటుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థలోనూ ఇలాంటి పొరపాట్లు జరగడంపై దుమారం చెలరేగుతోంది. ఇది ఎంత వరకు దారి తీస్తోందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ..దీనిపై ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణకు ఆదేశించారు. సేలం పెరియార్ యూనివర్శిటీ పీజీ చరిత్ర పరీక్షలో అడిగే కులతత్వ ప్రశ్నల వెనుక ఉన్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎఐఎడిఎంకె, బిజెపి, పిఎంకె, కమల్ హసన్ ఎంఎన్‌ఎం, డిఎంకె, సిపిఎం వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఖండించాయి. ఒక సంఘ సంస్కర్త పేరుతో విద్యా సంస్థలో కులతత్వానికి సంబంధించిన ప్రశ్న రావటం దురదృష్టకరం అంటూ ఖండించాయి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.