Jr NTR Heroins: ఎన్టీఆర్ హీరోయిన్స్ ఎవరు?.. క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక, ఫ్యాన్స్ కు ఫస్ట్ బర్త్ డే ట్రీట్ ఆ రేంజ్ లోనే ఇచ్చారు. ఏకంగా రెండు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. రెండూ ఊరమాస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇంత వరకూ బాగానే ఉంది. కాని, ఈ సినిమాల్లో ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్స్ నటిస్తున్నారు.

Jr NTR Heroins: ఎన్టీఆర్ హీరోయిన్స్ ఎవరు?.. క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

Jr NTR

Jr NTR Heroins: ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక, ఫ్యాన్స్ కు ఫస్ట్ బర్త్ డే ట్రీట్ ఆ రేంజ్ లోనే ఇచ్చారు. ఏకంగా రెండు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. రెండూ ఊరమాస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇంత వరకూ బాగానే ఉంది. కాని, ఈ సినిమాల్లో ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్స్ నటిస్తున్నారు.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇదే.

NTR30-NTR31: కొరటాల-ఎన్టీఆర్-ప్రశాంత్.. ఫస్ట్ లుక్‌తోనే ప్రకంపనలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యింది. కరెక్ట్ గా తారక్ బర్త్ డే కి ఒక రోజు ముందే ఎన్టీఆర్ 30 అనౌన్స్ అయింది. ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయ్. ఇక మూవీ.. సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. నెక్ట్స్ మంత్ నుంచి.. రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ను ఫిక్సయ్యారు. ఈ మధ్యే.. ట్రిపుల్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు.. ఆలియా కూడా ప్రకటించింది.

NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!

ఏం జరిగిందో ఏమో కరెక్ట్ రీజన్ అయితే తెలియదు గానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుంది. ఆలియా తప్పుకుందని తెలిశాక.. ఎన్టీఆర్ సరసన కనిపించబోయే హీరోయిన్ ఎవరన్న దానిపై.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేసింది. అదేంటంటే.. ఆలియా ప్లేస్ లో క్రేజీ హీరోయన్ కియారా అడ్వాణీతో రీప్లేస్ చేయనుంది అనేదే ఆ న్యూస్. మరో వైపు పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక కూడా తారక్ సరన నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!

ఇక తారక్ బర్త్ డే రోజే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టూ ప్రకటించి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అందించారు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ 30 ప్రీ లుక్ టీజర్ అయితే ఫ్యాన్స్ ను ఇప్పటికే హోరెత్తిస్తుంటే.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ ఇంటెన్స్ లక్ వైలెన్స్ కి పీక్స్ అన్నట్టే ఉంది. కాకపోతే ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి హీరోయిన్ సెలక్షన్ కి ఇంకా టైమ్ ఉంది. కాని, కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో చేసేందుకు.. అటు కియారా ఇటు రష్మికా లేక వేరే హీరోయినా? తెలియాలంటే.. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.