Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి

ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌శ్నించారు. విశాఖలో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ పనులను ఆయ‌న‌ పరిశీలించారు.

Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy

presidential election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌శ్నించారు. విశాఖలో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ పనులను ఆయ‌న‌ పరిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు, కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. టీడీపీ నేత‌ అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారని ఆయ‌న ఆరోపించారు.

JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే దక్కొచ్చని, ఆయ‌న‌ ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారని చెప్పారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని ఆయ‌న అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని ఆగదని ఆయ‌న చెప్పారు. సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాడ్స్‌తో రక్షణ గోడ నిర్వహిస్తున్నామని తెలిపారు.