President of India: కాబోయే రాష్ట్రపతి ఎవరు? ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే! వెంకయ్య నాయుడు? ఓం బిర్లా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి.

President of India: కాబోయే రాష్ట్రపతి ఎవరు? ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే! వెంకయ్య నాయుడు? ఓం బిర్లా?

President of India

President of India: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాలు వేడెక్కనుండగా.. దేశ రాష్ట్రపతిని జూలై నెలలో, ఉపరాష్ట్రపతిని ఆగస్టులో ఎన్నుకోబోతున్నారు. అందువల్ల, ఈ ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత ఈ పదవికి సంబంధించి పోటీ ఉంటుందా? లేదా? అనేది స్పష్టత రానుంది.

ఎన్‌డిఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఈ రెండు పదవులలో కూర్చబెట్టే వ్యక్తి ఏకగ్రీవం అవుతారా? లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా పోటీ ఉంటుందా? అనేది అప్పుడే తెలనుంది. ప్రస్తుతం ఎంపీలు, రాష్ట్ర శాసనసభల్లో ఎన్‌డిఏకు మెజారిటీ ఉంది.

ఐదేళ్ల క్రితం 2017లో పంజాబ్ మినహా ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగు రాష్ట్రాలలో బీజేపీ అంటే ఎన్‌డిఏ కాబట్టి, ఈ రెండు పదవులకు ఎంపిక ఈజీ అయ్యింది. అప్పుడు ఎన్నికలు కూడా లాంఛనప్రాయమే అయింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభలతో పాటు, రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా ఓటర్లు కాగా, ఉపాధ్యక్షుడిని ఉభయ సభల ఎంపీలు ఎన్నుకుంటారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మోదీ ప్రభుత్వానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకంగా భావిస్తున్నారు.

అయితే, ఈ ఐదు అసెంబ్లీల ఫలితాలు ఎలా వచ్చినా నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వరకు దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరనే ప్రశ్న ఇప్పటికే పొలిటికల్‌ కారిడార్‌లో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మరోసారి రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కుతుందా? లేక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పదోన్నతి కల్పిస్తారా? లేక ఈ రెండు పదవుల్లోనూ కొత్త ముఖాన్ని తీసుకొస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పదవికి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. రాజేంద్రప్రసాద్.. 26 జనవరి 1950 నుండి 13 మే 1962 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత మరెవరికీ ఈ అవకాశం దక్కలేదు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జూలైలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కోవింద్ మళ్లీ ఎన్నికైతే, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 15వ రాష్ట్రపతి అవుతాడు.

ఈ రెండు పదవులకు ఎవరెవరు పోటీ చేస్తారనేది జూన్‌లో ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియలోపే తేలిపోనుంది. అయితే పొలిటికల్ కారిడార్‌లో ప్రస్తుతం ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆయనను ఈ రెండు పదవుల్లో దేనికైనా పోటీకి దింపవచ్చని చెబుతున్నారు.

వెంకయ్య నాయుడుకు పదోన్నతి లభిస్తే, ఓం బిర్లాను ఉపరాష్ట్రపతిని చేయవచ్చు. లేకుంటే, ఓం బిర్లా రాష్ట్రపతి అయితే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్‌ని ఉపరాష్ట్రపతిని చేయవచ్చు అని చెబుతున్నారు.

అయితే, ఓం బిర్లా.. జగదీప్ ధంఖర్ ఇద్దరూ రాజస్థాన్‌‍కే చెందినవారు కాగా.. ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరిని రెండు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉంచే తప్పు ఏ ప్రభుత్వమూ చేయదు. చూడాలిమరి ప్రధాని మోదీ నిర్ణయం ఎలా ఉందో?