వైఎస్ షర్మిల వెనుక ఆ ఇద్దరు.. చేవెళ్ల నుంచి పాదయాత్ర

వైఎస్ షర్మిల వెనుక ఆ ఇద్దరు.. చేవెళ్ల నుంచి పాదయాత్ర

who is behind ys sharmila new party: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్మిల వెనుకున్నది ఎవరనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. వైఎస్ షర్మిల వెనుక వైఎస్ఆర్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల వెంట వైఎస్ఆర్ అత్యంత సన్నిహితులు కేవీపీ, సూరీడు ఉన్నట్లు సమాచారం. ఇక షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రకు ప్లాన్ చేశారని, దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు:
కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని విమర్శించారు. రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా అని అడిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లైంది.. పక్కా ఇళ్లు అందరికీ వచ్చాయా అని ప్రశ్నించారు.

మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్న షర్మిల.. రాజన్న రాజ్యం రావాలని అందరూ కోరకుంటున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని తన నమ్మకం అన్నారు. తాను తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. రాజన్న సువర్ణ పాలన తెచ్చేందుకే వచ్చానన్నారు. జగన్.. ఏపీలో పని చేస్తున్నారని..తాను తెలంగాణకు కమిటెడ్ గా పని చేయాలనుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ పై అభిమానం చెక్కు చెదరలేదన్న షర్మిల.. వైఎస్ పాలనలో రైతు రాజులా బతికాడన్నారు.