endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 06:09 AM IST
endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ ఎక్కడికీ పోదని,మన మధ్యే ఉండబోతుందని డబ్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ జే రేయాన్ తెలిపారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వస్తే ఈ మహమ్మారి తొందరగా అంతమైపోతుందని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. మనం సమర్థవంతంగా వాడుకోని.. ఎన్నో.ఖచ్చితంగా ప్రభావవంతమైన వ్యాక్సిన్ లు కొన్ని ఈ భూమిపైన మనం కలిగి ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ వైరస్ pandemic(మహమ్మారి)నుంచి endemic( ఓ ప్రత్యేకమైన గ్రూప్ లో చాలా సాధారణమైన మరియు తరుచూ కనుగొనబడే ఓ వ్యాధి లేదా స్థితి)గా మారవచ్చని మైఖేల్ అన్నారు. HIV మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదన్నారు. హెచ్ఐవీ ఇప్పటికీ భూమి మీదనుంచి వెళ్లిపోలేదని, అదే విధంగా ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.

రోజువారీ కేసుల సంఖ్యను సాధ్యమైనంత తక్కువ స్థాయికి చేరుకుని, వీలైనంత ఎక్కువగా వైరస్ ను సమాజం నుండి బయటకి తీసుకెళ్లగలిగితే…తక్కువ స్థాయిలో కరోనా వ్యాప్తి, తక్కువ ప్రమాదం ఉంటుందని మైఖేల్ తెలిపారు. అయితే అధికస్థాయిలో వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో లాక్ డౌన్ ఆంక్షలను తొలగించి రీ ఓపెన్ చేస్తే మాత్రం వైరస్ వ్యాప్తి వేగవంతం కావచ్చు అని మైఖేల్ తెలిపారు. లాక్  డౌన్ ఆంక్షలు సడలించడం కరెక్ట్ కాదన్న ఆయన, రెండోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదన్నారు.

ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4,429,930 కేసులు నమోదవగా,298,174 మంది కరోనా సోకి మరణించారు.1,659,806మంది కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు యూఎస్ లో 1,430,348 కేసులు నమోదవగా, 85,197 మరణాలు నమోదయ్యయి. భారత్ లో కేసుల సంఖ్య 78వేలు దాటగా,మరణాల సంఖ్య 2,550కి చేరుకుంది. 

Read Here>> 3లక్షలకు చేరువలో కరోనా మరణాలు