స్వార్థం మంచిదే.. తప్పేం కాదు.. కారణం ఇదే..!

స్వార్థం మంచిదే.. తప్పేం కాదు.. కారణం ఇదే..!

స్వార్థపరులు ఎక్కువయ్యారు సమాజంలో అంటూ తిట్టుకుంటూ ఉంటాం కదా? స్వార్థం కూడా మంచిదేనట.. అవును స్వార్థంతో ఉండడం అనేది మానసికంగా మంచిది అని అంటున్నారు నిపుణులు. మనిషి పై మనిషికి మమత లేదు.. మానవత్వం మచ్చుకైనా కానరాట్లేదు.. అంటాం కదా? స్వార్థం వల్లే ఇదంతా అంటుంటాం కూడా.. ఆర్ధిక అనుబంధాలు పెరిగి ఆప్యాయతా.. అనురాగాలు తగ్గిపోయిన కాలంలో.. స్వార్థపూరితంగా ఉండటం నిజంగా మానసిక ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.

వాస్తవానికి స్వార్థపూరితంగా ఉండటం చెడ్డ విషయం అనే అపోహ ప్రజల్లోనూ.. సమాజంలోనూ ఉంది. అది నిజం కాదు! ప్రపంచాన్ని చుట్టుముట్టేలా చేస్తుంది, కళ మరియు నాగరికతను సృష్టిస్తుంది స్వార్థపరులే. సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి స్వార్థం చాలా ముఖ్యం. మనకోసం జీవించడమే స్వార్థం అయితే, అలా జీవించడం వల్ల మనుషులు మానసికంగా ఆనందంగా ఉంటారట.

నిస్వార్థంగా ఉండడం వల్ల.. ‘సమస్య ఏమిటంటే, మీరు అందరి అవసరాలకు మొదటి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత, మీ కోసం సమయం కేటాయిస్తారు. అందువల్ల మీ సమస్య తీర్చుకోవడానికి సమయం, శక్తి ఉండదు. ‘నిస్వార్థంగా ఉండటానికి అయ్యే ఖర్చు మీ స్వంత పనులను వదులుకోవడం. మీరు మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు? మీరు ఒత్తిడికి గురైతే, అలసిపోయి, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు.

‘స్వీయ-ప్రేమ మరియు స్వీయ సంరక్షణ వంటి పనులు వల్ల మీరు స్వార్థపరులు అని మిమ్మల్ని అంటే.. బాధపడక్కర్లేదు.. అది నేరమూ కాదు.. అనవసరమైన విషయాలలో వేలు పెట్టి, ఇబ్బందులు పడి మానసిక సంఘర్షణకు గురవవ్వడం కంటే.. స్వార్థంగా ఉండడం వల్ల మేలే కదా? నేను అనే స్వార్థం.. నా కుటుంబం అనే స్వార్థం.. ఉండడం తప్పు కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

నివేదికల ప్రకారం స్వార్థం లేని వారు ఎక్కువగా డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఏటా మానసిక సమస్యలతో సతమతమవుతున్నవారి సంఖ్య ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం కూడా నిస్వార్థంగా ఉండడమే అంటున్నారు.

మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని, తద్వారా కుటుంబాలు, సమాజం ఆనందంగా ఉంటుందని, నిస్వార్థంగా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయాన్నా వ్యక్తం చేస్తున్నారు.