Sugar Levels : తెల్లవారు జాము సమయంలో షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయంటే?…

తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌కు గుర‌య్యేవారిలో కార్టిసోల్‌, గ్రోత్ హార్మోన్లు ఎక్కువ‌గా విడుద‌ల‌వుతుంటాయి. అవి లివ‌ర్‌కు ఎక్కువ‌గా గ్లూకోజ్‌ను ఉత్ప‌త్తి చేయ‌మ‌ని చెబుతుంటాయి.

Sugar Levels : తెల్లవారు జాము సమయంలో షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయంటే?…

Sugar

Sugar Levels : జీవన శైలి, ఆహారపు అలవాట్లో మార్పు కారణంగా మన శరీరానికి అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్. డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధి. ఎవరికైతే డయాబెటిస్​ వచ్చిందో వారికి జీవిత కాలంలో చాలా కాలం మధుమేహం ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది, తరచుగా మూత్ర విసర్జన, పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం , కంటి చూపు మందగించడం, కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం, ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం దీని ముఖ్య లక్షణాలు.

రాత్రి పూట స‌హ‌జంగానే కొంద‌రికి నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేందుకు, మంచి నీళ్ల‌ను తాగేందుకు కొంద‌రు నిద్ర లేస్తుంటారు. ఎక్కువ‌గా వ‌య‌స్సు అయిపోయిన వారు రాత్రి పూట నిద్ర లేస్తారు. ఇక షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి కూడా రాత్రి పూట మెళ‌కువ వ‌స్తుంటుంది. వారు కూడా మూత్ర విస‌ర్జ‌న కోసం నిద్ర లేస్తారు.అయితే కొంద‌రికి తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతుంటాయి. ఇందుకు డాక్ట‌ర్లు రెండు కార‌ణాల‌ను చెబుతున్నారు. అవేమిటంటే..

తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌కు గుర‌య్యేవారిలో కార్టిసోల్‌, గ్రోత్ హార్మోన్లు ఎక్కువ‌గా విడుద‌ల‌వుతుంటాయి. అవి లివ‌ర్‌కు ఎక్కువ‌గా గ్లూకోజ్‌ను ఉత్ప‌త్తి చేయ‌మ‌ని చెబుతుంటాయి. రాత్రి పూట కార్టిసోల్ స్థాయిలు పెరిగిన‌ప్పుడు స‌హ‌జంగానే లివ‌ర్ గ్లూకోజ్ ను విడుద‌ల‌ చేస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. ఇక రాత్రి పూట కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా ప‌డిపోతాయి. దీంతో లివ‌ర్ గ్లూకోజ్‌ను అధికంగా విడుద‌ల చేస్తుంది. ఈ క్ర‌మంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. అయితే షుగ‌ర్ ఉన్న‌వారిలోనే ఈ విధంగా జ‌రుగుతుంటుంది.

ఆరోగ్యవంతులు అయితే ఇలా షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగినా వెంట‌నే త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కానీ షుగ‌ర్ ఉన్న‌వారిలో ఇలా తెల్ల‌వారు జామున షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగితే మాత్రం క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. ఆ స‌మ‌యంలో షుగ‌ర్ చెకింగ్ మెషిన్‌తో ఒక్క‌సారి షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయ‌డం మంచిది. దీంతో అందుకు అనుగుణంగా వైద్య‌లు మందుల‌ను అందిస్తారు. త‌ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రపోవటం చాలా మందికి అలవాటు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలకు మంచి ఫలితాలు వచ్చాయంట. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12శాతం అధికంగా తగ్గిపోయాయి.